viral video: రీల్స్ కోసం ప్రయాణికుడి చెంపపై కొట్టిన యూట్యూబర్ ..రియాక్షన్ చూడండి !

రీల్స్ మోజులో కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.  అయితే రీసెంట్ పాట్నాలో ఓ యూట్యూబర్ రీల్స్ కోసం ఓ వెధవ పనిచేశాడు. 


Published Mar 03, 2025 03:35:00 PM
postImages/2025-03-03/1740996428_avideoofayoutuberslappingatrainpassengerwentviral02083387516x90.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రీల్స్ కోసం ఇప్పుడు కుర్రాళ్లు ఏమైనా చేస్తున్నారు. ప్రాణాలుపోతున్నా బయపడడం లేదు. లైఫ్ రిస్క్ అవుతున్నా పట్టించుకోవడం లేదు.రీల్స్ మోజులో కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.  అయితే రీసెంట్ పాట్నాలో ఓ యూట్యూబర్ రీల్స్ కోసం ఓ వెధవ పనిచేశాడు. 


రైల్వే స్టేషన్ లో రైలు కదులుతుండగా... కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికుడి చెంపపై తన ఫ్రెండ్ తో కొట్టించాడు. దాన్ని వీడియో తీశాడు. ఇది కేవలం రీల్స్ కోసం చేశాడు. కొట్టిన తర్వాత కూడా ఏదో గొప్ప పనిలా నవ్వుతూ ..లైక్స్ వస్తాయి బాగా అంటూ సంబరపడ్డాడు.


సదరు ప్రయాణికుడు ఈ ఘటనతో దిగ్భ్రాంతి చెందాడు. ఈ విషయాన్ని రైల్వే పోలీసులకు దృష్టికి తీసుకెళ్లడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజి పరిశీలించిన పోలీసులు యూట్యూబర్ రితేష్ కుమార్ ను, అతడి ఫ్రెండ్ ను అరెస్ట్ చేశారు. ఆ యూట్యూబర్ తో క్షమాపణ చెప్పించి వీడియో తీసి తన అకౌంట్ లోనే పోస్ట్ చేశారు. వ్యూస్ కోసమే ఇలా చేశామంటూ ఆ యూట్యూబర్ వెల్లడించాడు.

 

Related Articles