ఒంటరితనం తో బాధపడే ఓ మహిళ తనకు ఎంతో ఇష్టమైన పిల్లి చనిపోయిందని తనుకూడా ఆత్మహత్య చేసుకుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఒంటరితనం చాలా భయంకరమైనది. ఫిజికల్ గా ఎన్ని సంతోషాలున్నా..మానసికంగా క్షణక్షణం చంపేస్తుంది. మన కోసం ఒకరుండాలి...మన సంతోషాలు వారి సంతోషాలు అవ్వాలి. ఒంటరితనం తో బాధపడే ఓ మహిళ తనకు ఎంతో ఇష్టమైన పిల్లి చనిపోయిందని తనుకూడా ఆత్మహత్య చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిందీ ఘటన. మొహల్లా కోట్‌కు చెందిన పూజాదేవి (36) పదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఆ తర్వాత రెండేళ్లకే భర్త నుంచి విడిపోయింది. అప్పటి నుంచి తన తల్లి, సోదరుడుతో ఉంటుంది. ఉన్నా ...చాలా కాలంగా డిప్రెషన్ తో బాధపడుతుంది. ఇలాంటి టైంలో రోడ్డు మీద కనిపించిన ఓ పిల్లి ని పెంచుకోవడం మొదలుపెట్టింది. ఆ పిల్లి తన ప్రపంచం.
అది గురువారం చనిపోవడంతో తట్టుకోలేకపోయింది. దీంతో దానిని తీసుకెళ్లి పాతిపెట్టేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా ఆమె అడ్డుకుంది. అది తిరిగి బతుకుతుందని వారితో వాదనకు దిగింది. అది బతకకపోయేసరికి తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయింది. తను రెండేళ్లు గా డిప్రెషన్ టాబ్లెట్స్ వాడుతుందని తన సోదరుడు పోలీసుల విచారణ లో తెలిపారు.