లాస్ట్ మంథ్ రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ , నటి రష్మిక లీడ్ రోల్ లో నటించిన మూవీ ఛావా ...లక్ష్మణ్ ఉటేకర్ డైరక్షన్ లో భారీ బడ్జెట్ తో రిలీజ్ అయ్యింది. ఇప్పటికే బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా దీనిని సిద్ధం చేశారు. లాస్ట్ మంథ్ రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై మార్చి 7న ఇది విడుదల కానుంది. తాజాగా 'ఛావా' తెలుగు ట్రైలర్‌ను టీమ్ విడుదల చేసింది. అయితే ఇప్పటికే హిందీ వెర్షన్ బాగా పాపులర్ అవ్వడం వల్ల ఇప్పుడీ తెలుగు ట్రైలర్‌కు కూడా బాగా వ్యూవ్స్ పెరుగుతున్నాయి. అందులోను ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు కథ కావడం జనాలను మరింత అలర్ట్ చేస్తుంది. హిందువుల కోసం పోరాడిన గొప్ప దేశభక్తుడు శివాజీ మహారాజ్ అయితే అతని కొడుకు శంభాజీ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కాని దేశం గుర్తించుకోదగిన వ్యక్తి శంభాజీ మహారాజ్ కూడా అని తెలిపేదే ఈ సినిమా. ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటం వల్ల టాలీవుడ్‌లోనూ మంచి కలెక్షన్స్ రానున్నాయంటూ ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.