బాక్సాపీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ , లక్ష్మణ్ ఉటేకర్ కాంబినేషన్ లో వచ్చిన తాజామూవీ " ఛావా " మరాఠా యోధుడు శంబాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన డే వన్ నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఛావా ...బాక్సాపీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించారు.
అయితే బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఛావా ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ మార్చి 7 న తెలుగులో రిలీజ్ కు రెడీ అవుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఛావా మూవీ ట్రైలర్ పై కీలకప్రకటన చేసింది. ఈ నెల 3న ఉదయం 10 గంటలకు ఛావా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా బీజీఎంతో కూడిన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.
The storm of power and courage is ready to strike!
![]()
Tags : newslinetelugu vicky-kaushal rashmika-mandanna