ఈ ఉపవాసాలతో శరీరంలో కొన్ని హార్మోన్లు విడుదలై ఆరోగ్యాన్ని క్రమబద్ధీ కరిస్తాయి. అయితే 30 రోజుల పాటు ఉపవాసం అంటే ...చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవల్సిందే.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ముస్లిం సోదరులు ప్రతి యేటా చేసే రంజాన్ మాసం మొదలైంది. ఉపవాస దీక్షలు చేస్తూ అల్లా ఆరాధనలో ఉంటారు. ఈ టైంలో ఉపవాసం చేస్తూనే ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఉపవాసం అంటే అల్లాహ్ కు దగ్గరగా ఉండటం. 30 రోజులపాటు రోజూ 12 గంటల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉండటం. ఈ ఉపవాసాలతో శరీరంలో కొన్ని హార్మోన్లు విడుదలై ఆరోగ్యాన్ని క్రమబద్ధీ కరిస్తాయి. అయితే 30 రోజుల పాటు ఉపవాసం అంటే ...చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవల్సిందే.
ఉపవాసాలతో శరీరం డీటాక్సిఫికేషన్ అవుతుంది. కిడ్నీలు క్లీన్ అవుతాయి. వ్యర్ధాలు బయటకు పోయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలర్జీలతో కలిగే ఇబ్బందులు తగ్గుతాయి. ఉపవాసాలతో పొట్టకు విశ్రాంతి లభిస్తుంది. వ్యసనాల నుంచి దూరంగా ఉంటాం. మెదడు పనితీరు మెరుగవుతుంది. ఉపవాసాల వల్ల కొందరికి ఛాతీలో మంట, తలనొప్పి, నీటి కొరత, మలబద్దకం, ఒత్తిడి కలగవచ్చు. ఇలాంటి టైంలో మాత్రం డాక్టర్ ను కలవాలి.
అయితే గుండె జబ్బులు, గుండె ఆపరేషన్లు జరిగిన వారు, 7, 9 మాసాల గర్భంతో ఉన్నవారు, బాలింతలు, డయాలసిస్ రోగులు, కిడ్నీ రోగులు, నెలసరి రుతుస్రావంలో ఉన్నవా రు, మూర్ఛ వ్యాధి ఉన్నవారు, మతి స్థిమితం లేనివారు, ప్రయాణంలో ఉన్నవారు. మహమ్మద్ ప్రవక్త(స) ప్రకారం సహరిలో ఖర్జూరం తినడం అత్యుత్తమం. నీళ్లు కూడా తీసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి.
పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులను కలిగి ఆహారాన్ని తీసుకోవాలి. మసాలాలు, నూనెలు ఎక్కువగా ఉన్న వంటకాలకు చాలా తక్కువగా తీసుకోవాలి. ఉపవాసం పూర్తయ్యాక కూడా ఖర్జూరాలను తినడమే మేలు. చాలా వరకు మసాలా ఫుడ్స్ మానేయండి. హలీమ్, హరీస్ కూడా తక్కువగా తీసుకోవాలి. రమజాన్ ఉపవాసాల వల్ల డిప్రెప్షన్, యాంగ్జయిటీ లాంటి మానసిక వ్యాధులు తగ్గుతాయి. రంజాన్ మాసంలో బరువు పెరగకుండా సాత్వికాహారాన్ని తీసుకోవాలి.
చిన్న పిల్లలు తాము కూడా ఉపవాసం ఉంటామని మారాం చేస్తారు. అలాంటి పిల్లలకు సగం రోజు ఉపవాసం ఉండేలా సాధన చేయించాలి. హై రిస్క్ ఉన్న గర్భిణులు రంజాన్ ఉపవాసాలు ఉండకపోవడమే ఉత్తమం. మిగతావారికీ మినహాయింపు ఉంది. ఆరు నెలలలోపు వయస్సు కలిగిన పిల్లలు ఉన్న బాలింతలకు ఉపవాసాలు పాటించాల్సిన అవసరంలేదు. పసిపిల్లలు ఉన్న తల్లులు ఉపవాసం చేయకపోవడమే మంచిది.