OTT: తండేల్ ఓటీటీ రిలీజ్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

సునామీ సృష్టిస్తూ ఏకంగా రూ.100 కోట్ల‌కు పైనే ఈ చిత్రం వ‌సూళ్ల‌ను సాధించింది. చైతన్య కెరియర్ లోనే బెస్ట్ గా నిలిచిన సినిమా.


Published Mar 02, 2025 06:59:00 PM
postImages/2025-03-02/1740922246_20250206234737NagaChaitanyaandSaiPallaviinThandel.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: అక్కినేని నాగచైతన్య యాక్ట్ చేసన తండేల్ ..చందు మొండేటి డైరక్షన్ లో వచ్చిన సినిమా సాయిపల్లవి హీరోయిన్ . ఫిబ్రవరి 7న థియేటర్ లో రిలీజ్ అయిన మూవీ ..నాగచైతన్య కెరియర్ లో 100 కోట్లు కలక్ట్ చేసిన సినిమా. థియేట‌ర్ల‌లో క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తూ ఏకంగా రూ.100 కోట్ల‌కు పైనే ఈ చిత్రం వ‌సూళ్ల‌ను సాధించింది. చైతన్య కెరియర్ లోనే బెస్ట్ గా నిలిచిన సినిమా.


మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు వేటకు వెళ్లి.. పాకిస్థాన్‌ కోస్ట్‌ గార్డుకు చిక్కి జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు వెయిట్ చేస్తున్నారు. చైతన్య ఫ్యాన్స్ తో పాటు ..మూవీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.


ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. ఈ చిత్రాన్ని 7 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు చెప్పింది.అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu -ott-movies nagachaitanya net-flex thandel

Related Articles