RS Praveen: గౌరవం ఉంటే.. ఎందుకు రోడ్డున పడేశారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగానే ఉపాధ్యాయుల మీద అపారమైన గౌరవం ఉంటే.. ఎందుకు రాత్రికి రాత్రే 2000 పైగా గురుకుల టీచర్ల కుటుంబాలను అకారణంగా రోడ్డున పడేశారని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.


Published Sep 05, 2024 10:07:12 AM
postImages/2024-09-05/1725511032_polrsp.PNG

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగానే ఉపాధ్యాయుల మీద అపారమైన గౌరవం ఉంటే.. ఎందుకు రాత్రికి రాత్రే 2000 పైగా గురుకుల టీచర్ల కుటుంబాలను అకారణంగా రోడ్డున పడేశారని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. రేవంత్‌కు గౌరవం ఉంటే గురుకుల రిక్రూట్మెంట్లో మూడువేల బ్యాక్ లాగ్ పోస్టులు అకారణంగా ఉత్పన్నం అయ్యేవి కావు అని అన్నారు. ఇక నాలుగున్నర లక్షల మంది ప్రైవేటు టీచర్లను రేవంత్ ఎల్బీ స్టేడియంలో పబ్లిక్‌గా అవమానించే వారు కాదని ఎద్దేవా చేశారు.

మెగా డీయస్సీ పేరుతో ఇంత దగా జరిగేది కాదని, ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం జరిగేది అని ఆయన అన్నారు. టీచర్లు లేక వందల స్కూళ్లు మూతపడేవి కాదని, అందరు ఎంఈవోల నియామకం జరిగేదన్నారు. విద్యాశాఖ మంత్రి నియామకం ఆగేది కాదని, విద్యార్థులు న్యాయం కోసం రోడ్ల మీదికి రావడం, విషాహారం బారిన పడడం లాంటివి జరిగేవి కావు అని ప్రవీణ్ కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డి కేవలం ఉపాధ్యాయుల మీద ప్రేమ ఉన్నట్లు  నటిస్తున్నారని మండిపడ్డారు. ఆవేదనాభరిత సమయంలో శోక సముద్రంలో మునిగిన టీచర్ల వైపు ప్రజలందరూ నిలబడాల్సిన సమయం అని ఆయన అన్నారు. ఇప్పుడు పండుగ చేసుకునే సమయమ అసలే కాదని ఉపాధ్యాయులను ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. 

newsline-whatsapp-channel
Tags : india-people fire brs school-teacher cm-revanth-reddy congress-government teacher rspraveenkumar

Related Articles