Chalaki Chanti: 'జబర్దస్త్' నేను మానుకోలేదు ..వాళ్లు తీసేస్తే బయటకు వచ్చేశా !


Published Oct 16, 2024 01:41:00 PM
postImages/2024-10-16/1729066342_chalakichanti551682239106.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జబర్థస్త్ కామెడీ షో లో చలాకీ చంటి చాలా మంచి కమెడియన్ . పేరు సంపాదించుకున్నాడు.. బిగ్ బాస్ కు వెళ్లాడు. జబర్దస్త్ స్టేజ్ మీద ఆరేళ్ల పాటు తన కామెడీని నమ్ముకున్నాడు.ఈ మధ్య మాత్రం ఆయన 'జబర్దస్త్' లో కనిపించడం లేదు. ఓ ఇంటర్వ్యూ లో ఎందుకు మీరు జబర్ధస్త్ మానేశాడు 


'జబర్దస్త్' నేను మానేయలేదు .. వాళ్లే మానేయమన్నారు. ఎందుకని అడిగే అలవాటు నాకు లేదు. వాళ్లు వద్దన్నారు .. నేను మానేశాను అంతే. దీనికి మీరు పొగరు అని పేరు పెడితే నేను ఏం చెయ్యలేను. నాకు కాళ్లు పట్టుకునే అలవాటు లేదు.  నాకు ఈగో ఎక్కువని పదేళ్లుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అసలు ఈ భూమి మీద నాకు తప్ప ఎవ్వరికి ఈగో లేదా ఇది నన్ను అనుకునే వారికి నేను అడిగే ప్రశ్న ఇదే.


" నేను ఎంకరేజ్ చేసినవారికి నాకంటే నాలుగు 'చప్పట్లు' ఎక్కువ పడితే నేను సంతోషించాను. కానీ అవతలివారు నాకంటే గొప్ప అనుకున్నారు. సమయం కోసం ఎదురుచూశారు .. పొడిచారు. మోసం చేయడం వాళ్ల తప్పుకాదు ... మోసపోవడం నా తప్పు. 'బిగ్ బాస్'కి వెళ్లడం వలన నా కెరియర్ కి రూపాయి ఉపయోగం లేదు. ఇక ఇంతకు మించి నేనేం మాట్లాడలేను .. ఆ విషయం వదిలేద్దాం"  నాకు పేరు రాలేదు ...అవకాశాలు రాలేదు. జస్ట్ టైం పాస్ కి వెళ్లాను ..ఇక ఇంతకంటే మాట్లాడకపోవడమే మంచిది వదిలై అంటూ ఆ టాపిక్ ను అక్కడికి కట్ చేసేశాడు చంటి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jabardasth etv

Related Articles