Eshwar Harris : ఎన్టీఆర్ డూప్ ఇతనే...RRR లో సగం పైన ఇతని షార్ట్సే !

రీసెంట్ గా ఎన్టీఆర్ బాడీ డబుల్ అని ఈశ్వర్ హారిస్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అప్పుడే చాలా ఇంట్రస్టింగ్ విషయాలు బయటపడ్డాయి.


Published Apr 23, 2025 07:30:00 PM
postImages/2025-04-23/1745416952_ntrbodydouble1024x576.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ప్రతి హీరోకు బాడీ డబుల్ అదేనండి డూప్ ఉండడం చాలా సహజం. ఇన్నాళ్లు ప్రభాస్ డూప్ గురించే తెలుసు మనకు. కాని ఎన్టీఆర్ బాడీ డబుల్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాడు. కొంతమందిని ఈ డూప్ ను యాక్షన్ సీన్స్ కోసం వాడితే, కొంతమంది బాడీ డబుల్స్ ని మాత్రం చీటింగ్ సీన్స్ కోసం వాడతారు. అంటే ఫేస్ కనిపించకుండా ఉండే సీన్స్ లో ఈ బాడీ డబుల్స్ ని వాడతారు. రీసెంట్ గా ఎన్టీఆర్ బాడీ డబుల్ అని ఈశ్వర్ హారిస్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అప్పుడే చాలా ఇంట్రస్టింగ్ విషయాలు బయటపడ్డాయి.


ఈశ్వర్ హారిస్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓ పక్క సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూనే చిన్న చిన్న సినిమాల్లో పాత్రలు చేస్తున్నాడు. అయితే నేను ఆచార్య సినిమాలో చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఆ సినిమా షూట్ లో నన్ను కలిసి ఎన్టీఆర్ డూప్ లాగా ఉన్నాను అని, రాజమౌళి టీం దగ్గరకు తీసుకెళ్లారు. కొమురం భీముడొ సాంగ్ లో ఆయన ఫేస్ కనిపించనివి అన్ని నా షాట్స్. కాళ్ళు, చేతులు మీద రక్తం కారడం, రోప్ కట్టి లాగడం అవన్నీ నాతోనే చేశారు. చాలా షార్ట్స్ నేనే చేశానని తెలిపారు. 


జెప్టో యాడ్ లో దాదాపు 8 గంటలు బాడీ డబుల్ గా నేనే యాక్ట్ చేశాను. ఆ రోజు ఎన్టీఆర్ 8 గంటలు టైం ఇచ్చారు. దాంతో కెమెరా, లైటింగ్ సెటింగ్స్ అన్ని నన్ను పెట్టి చేసుకున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాకు కూడా పిలుస్తారు అని అనుకుంటున్నాను. వార్ 2 సినిమాలో అవకాశం వచ్చింది. కాని ముంబై మూడు రోజులు రమ్మన్నారు. ఫ్లైట్ టికెట్స్ కూడా నేనే పెట్టుకోవాలి..వాళ్లిచ్చే డబ్బుతో నాకు ఆ టికెట్స్ కూడా రావని అందుకే ఈ ఛాన్స్ ను వదులుకున్నానని తెలిపారు. అంతేకాదు ..ప్రశాంత్ నీల్ సినిమా లో కూడా అవకాశం వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. నేనే ఎన్టీఆర్ బాడీ డబుల్ అయ్యాక నేను ఇండస్ట్రీ లో సెటిల్ అవుతాననే నమ్మకం వచ్చిందని తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr rrr

Related Articles