ఈ జంటకు ఇటీవల ఇరువురి కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్ధం కూడా జరిగింది. అయితే ఈ ఇద్దరి పెళ్లి మొదట్లో రాజస్థాన్ లో అనుకున్నారు. కాని పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో చేస్తున్నారని టాక్.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చైతన్య , శోభితల పెళ్లికి దూళిపాళను వివాహం చేసుకుంటున్నారు. అయితే ఈ పెళ్లికి అన్నపూర్ణ స్టూడియో ముస్తాబవుతుంది. గత కొంతకాలం నుంచి స్నేహం ఉంటున్న ఈ జంటకు ఇటీవల ఇరువురి కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్ధం కూడా జరిగింది. అయితే ఈ ఇద్దరి పెళ్లి మొదట్లో రాజస్థాన్ లో అనుకున్నారు. కాని పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో చేస్తున్నారని టాక్.
అయితే ఇప్పుడు ఆ వేదిక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోకు షిఫ్ట్ అయ్యిందని తెలిసింది. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ ప్రత్యేక పెళ్లి మండపం నిర్మిస్తున్నారట. దీని కోసం సినిమా రంగానికి చెందిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నారట. డిసెంబర్ 4 వ తారీఖున వీరిద్దరి పెళ్లి జరుగుతుందని సమాచారం . చాలా క్లోజ్ సర్కిల్ తోనే ఈ పెళ్లి జరుగుతుంది.
శోభిత దూళిపాళ ఇంట్లో కూడా ఇంతకు ముందే పెళ్లి పనులు మొదలుపెట్టారు. దీనికి సంబంధిచిన పనులు కూడా ఫుల్ వైరల్ అవుతున్నాయి. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో నాగచైతన్య తండేల్ చిత్రం నిర్మాణం తరువాత పనులు జరుపుకుంటుంది. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో తండేల్ రిలీజ్ కు మూవీ టీం రిలీజ్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది.