deeppika ,ranveer: దీపికా కుమార్తె పేరుకు అర్థం ఏంటో తెలుసా..?

దువా అంటే ప్రార్థన. మా ప్రేయర్స్‌కు సమాధానమే ఈమె’ అని పేర్కొంటూ చిన్నారి కాళ్లను ఫొటో తీసి షేర్‌ చేసుకున్నారు.


Published Nov 02, 2024 11:17:00 AM
postImages/2024-11-02/1730526513_deepikadua.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దీపికా పదుకొణె-రణ్‌వీర్‌ సింగ్‌ ముద్దుల తనయ పేరును ప్రకటించారు. దువా పదుకొణె సింగ్‌ అని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘దువా అంటే ప్రార్థన. మా ప్రేయర్స్‌కు సమాధానమే ఈమె’ అని పేర్కొంటూ చిన్నారి కాళ్లను ఫొటో తీసి షేర్‌ చేసుకున్నారు. పేరులో పవిత్రంగా ఉందంటున్నారు నెటిజన్లు. దీపికా , రణ్ వీర్ కు ఈ ఏడాది సెప్టెంబర్ లో కూతురు పుట్టింది. తన పేరును దువా గా పెట్టారు రణ్ వీర్ , దీపికా. దీంతో పాటు తమ గారాల పట్టి మొదటి ఫొటోను కూడా షేర్ చేసుకున్నారు. తన ప్రార్ధనలకు దువానే ప్రతీక అని తెలిపారు ఈ కపుల్.


దీపికా పదుకొణె- రణ్ వీర్ సింగ్ 2018లో పెళ్లిపీటలెక్కారు. తమ ఆరేళ్ల వైవాహిక బంధానికి ప్రతీకగా ఈ ఏడాది సెప్టెంబర్ లో పండంటి మహాలక్ష్మిని తమ జీవితంలోకి ఆహ్వానించారీ లవ్లీ కపుల్. దివాళీ సంధర్భంగా తనకు దొరికిన అధ్భుతమైన బహుమతిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.  తన పేరు తెలియజేయగానే ...అలియా భట్‌, మమితా బైజు, షాలినీ పాండే తదితర సినీ ప్రముఖులు దీపిక పోస్టకు స్పందించిన వారిలో ఉన్నారు. అందరూ ‘క్యూట్‌’ అంటూ లవ్‌ ఎమోజీలు చేస్తున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : deepika-padukone newslinetelugu ranveer-singh socialmedia daughter

Related Articles