squid game: స్క్విడ్ గేమ్ 2 టీజర్ లో ఈ పాయింట్స్ గమనించారా ?


ఇక గత సీజన్​లో చూసిన విధంగానే గ్రీన్‌ లైట్‌, రెడ్‌ లైట్‌ వంటి గేమ్స్‌ను మరోసారి ఈ సీజన్‌లోనూ చూడొచ్చుని ఆ వీడియో ద్వారా అర్థమవుతోంది.


Published Nov 02, 2024 10:32:00 PM
postImages/2024-11-02/1730567042_20241031224202SquidGame2.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: స్క్విడ్ గేమ్ 2 ఓ సంచలనం .2021 లో నెట్ ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అయిన ఈ సీరిస్ ...అప్పట్లో ఓ సంచలనం . అన్ని దేశాల్లోను దుమ్ముదులిపేసింది. ఇప్పుడు పార్ట్ 2 వస్తుంది. టీజర్ ను రిలజీ్ చేశారు. డిసెంబర్‌ 26 నుంచి ఇది స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. స్వీకెన్స్ టీజర్ లో కొన్ని ఇంట్రస్టింగ్ పాయింట్స్ ను రివీల్ చేశారు టీం.


ఇక గత సీజన్​లో చూసిన విధంగానే గ్రీన్‌ లైట్‌, రెడ్‌ లైట్‌ వంటి గేమ్స్‌ను మరోసారి ఈ సీజన్‌లోనూ చూడొచ్చుని ఆ వీడియో ద్వారా అర్థమవుతోంది. గత సీజన్‌లో ఈ ఆట నుంచి బయటపడిన 456వ కంటెస్టెంట్ సియోంగ్ గి-హున్ ఇందులో మళ్లీ పాల్గొనడం ఇది ప్రమాదకరం ఇక్కడినుంచి వెళ్లిపోదామంటూ కో ప్లేయర్స్​ను హెచ్చరించడం వంటి సీన్స్ టీజర్​లో కీ హైలైట్స్​గా నిలిచాయి. ఆట గురించి తెలిసిన ప్లేయర్ తను ఒక్కడే . మళ్లీ ఎందుకు వచ్చాడు ...లాంటి ఇంట్రిస్టింగ్ పాయింట్స్ తో చాలా ఆసక్తి గా ఉంది.


ఇంతకీ ఈ గేమ్ చాలా సులువు...స్వ్కిడ్ గేమ్ లో పాల్గొన్న వారు గెలిచితీరాలి..లేదా ఎలిమినేట్ అవ్వాలి. ఈ గేమ్ లో ఎలిమినేషన్ అంటే చావడం. అలా అందరు చనిపోయిన మిగిలిన వారే విజేత...వాడే హీరో. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో స్టోరీ కంటిన్యూ అవుతుంది.ఈ సిరీస్‌ కొరియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. సుమారు 111 మిలియన్ల వ్యూస్‌తో తెగ ట్రెండ్ అయ్యింది. 


"స్క్విడ్‌ గేమ్‌కి ప్రాణం పోసి ఓ సిరీస్‌గా మీ ముందుకు తీసుకురావడానికి దాదాపు 12 ఏళ్లు పట్టింది. కానీ, ఎన్నడూ లేనివిధంగా నెట్‌ఫ్లిక్స్‌లో మోస్ట్‌ పాపులర్‌ షోగా 'స్క్విడ్‌ గేమ్‌' పేరు తెచ్చుకోవడానికి కేవలం 12 రోజులు మాత్రమే పట్టింది. ఈ విజయం నా 12 యేళ్ల కష్టాన్ని మరిచిపోయేలా చేసిందని అన్నారు డైరక్టర్.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu webseries movie-news net-flex

Related Articles