తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటమే ఇందుకు కారణం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలను చాలా రోజులుగా బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందడంతో చికెన్ తినాలంటేనే ప్రజలు చాలా భయపడుతున్నారు. అయితే బర్డ్ ఫ్లూ కాస్త తగ్గింది. ఫలితంగా ఇన్నాళ్లు తగ్గిన చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే, తాజాగా.. 8వేల కోళ్లు మృత్యువాత పడటం కలకలం సృష్టిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటమే ఇందుకు కారణం. ఓ ఫౌల్ట్రీ ఫాంలో మూడు రోజుల వ్యవధిలో ఏడు వేల కోళ్లు మరణించాయి. మెదక్ లో కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ లోని ఓకోళ్ల ఫారం లో మూడు రోజుల్లో వెయ్యికి పైగా కోళ్లు వింత వ్యాధితో చనిపోయాయి. మూడు రోజుల్లో దాదాపు వెయ్యికి పైగా కోళ్లు వింత వ్యాధితో చనిపోయాయి. దీంతో బర్డ్ ఫ్లూ వల్లే ఈ కోళ్లు చనిపోయాయన్న చర్చ జోరుగా సాగుతుంది.
కోళ్లు మృత్యువాత పడిన ఫారంను జిల్లా పశువైద్య అధికారులు సందర్శించారు. చనిపోయిన కోళ్లను పరిశీలించి.. కొన్నింటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. అయితే దీని వల్ల ఫౌల్టీ యాజమాన్యానికి భారీ నష్టమనే చెప్పాలి. అయితే ఇప్పుడు బర్డ్ ఫ్లూ తగ్గిందని ..చికెన్ తినడానికి అసలు బయపడక్కర్లేదని అంటున్నారు చికెన్ షాప్ ఓనర్లు.