DEEPIKA : బిడ్డ కోసం 100 కోట్లతో కొత్త ఇల్లు కొన్న రణ్‌వీర్ - దీపికా!

రణవీర్ సింగ్ జంట తన బిడ్డ కోసం దాదాపు 100 కోట్లతో ఓ అధ్భుతమైన గిఫ్ట్ ను రెడీ చేశారని బాలీవుడ్ అంతా కోడై కూస్తుంది.


Published Aug 30, 2024 09:46:00 PM
postImages/2024-08-30/1725034632_unnamed.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఒక ప్రాణం కడుపులో పడిదంటే చాలు ..పిల్లల కోసం ఏదేదో ఆలోచిస్తాం. వాళ్లు హ్యాపీ గా ఉండాలని...రూపాయి రూపాయి ..దాచి మరీ ...పిల్లల భవిష్యత్తుకు ప్లాన్స్ వేస్తుంటాం. మధ్యతరగతి వాళ్లం మనమే అలా ఉంటే..స్టార్స్ ఎలా ఆలోచిస్తారు. రణవీర్ సింగ్ జంట తన బిడ్డ కోసం దాదాపు 100 కోట్లతో ఓ అధ్భుతమైన గిఫ్ట్ ను రెడీ చేశారని బాలీవుడ్ అంతా కోడై కూస్తుంది.


బాలీవుడ్ లో దీపికా - రణ్‌వీర్ సింగ్ హిట్టు పేయర్. వీరిద్దరి కలిసి చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్టు. బాజీరావు మస్తానీ, రామ్ లీలా, పద్మావతి వీరిద్దరూ 2018లో ఇటలీలో తమ పేరెంట్స్ మధ్య చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. దీపికా పదుకొణే, షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన పఠాన్, జవాన్ చిత్రాలు 1000 కోట్ల క్లబ్‌లో చేరాయి. అదేవిధంగా ప్రభాస్‌తో కలిసి నటించిన కల్కి 2898 AD, రితిక్ రోషన్ జంటగా నటించిన ఫైటర్ సినిమాలు కూడా  సూపర్ డూపర్ హిట్ట్ గా నిలిచాయి. ప్రెగ్నెన్సీ కోసమే సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. 


ఇంకా కొన్ని నెలల్లో అందమైన బిడ్డకు తల్లి కాబోతున్న దీపికా పదుకొణే కొత్త ఇళ్లు . ఈ ఇల్లు బాంద్రా లో ఉందని, నటుడు షారుఖ్ ఖాన్ మన్నత్ ఇంటికి దగ్గర్లోనే ఈ కొత్త ఇళ్లు ఉందట. బాంద్రాలో వీరి ఇళ్లు 1300 వైశాల్యం లో ..చాలా లగ్జరీయస్ గా ఉందంటున్నారు బాలీవుడ్ టీం. ఈ నాలుగు అంతస్తుల్లో వారి జిమ్, స్విమ్మింగ్ పూల్, టెర్రస్ గార్డెన్, విజిటర్ రూమ్ తదితర సదుపాయాలు ఉన్నాయి. 2021 లో వీరు అలీబాగ్ లో 22 కోట్లకు బంగ్లా కొనుగోలు చేశారు . తన మొదటిబిడ్డతో గృహప్రవేశం చేసే ఆలోచనలో ఉన్నారట.
 

newsline-whatsapp-channel
Tags : deepika-padukone newslinetelugu pregnant bollywood

Related Articles