delhi: ఢిల్లీ లో విజయం దిశగా బీజేపీ ..​ 27ఏళ్ల తర్వాత అధికారం!

దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మ్యాజిక్‌ ఫిగర్‌ (36)ను దాటేసి అత్యధిక మెజార్టీలో అధిక్యం కనపడుతుంది. 


Published Feb 08, 2025 11:29:00 AM
postImages/2025-02-08/1738994467_67a6bbaa89823delhielectionresultslivebjpeyescomebackafter26years08042517016x9.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశవ్యాప్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్ వెలువడుతుండగా, దాదాపు 27 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కి పాజిటివ్ గా ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో కమలదళం ఆధిక్యంలో కొనసాగుతోంది. దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మ్యాజిక్‌ ఫిగర్‌ (36)ను దాటేసి అత్యధిక మెజార్టీలో అధిక్యం కనపడుతుంది. 


ఉదయం 10 గంటల వరకు వెలువడిన ఫలితాలను చూస్తుంటే బీజేపీ 39 స్థానంలో ముందంజలో కొనసాగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 31 స్థానాల్లో అధిక్యం కనబరుస్తుంది నాలుగోసారి అధికారం చేపట్టాలనుకున్న ఆప్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ గురించి ఎక్కడా మాట్లాడుకోకపోవడమే మంచిది. 


న్యూదిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ ముందంజ


కాల్‌కాజీ స్థానంలో దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ వెనుకంజ


జంగ్‌పురలో ఆప్ నేత మనీశ్ సిసోదియా ముందంజ


షాకుర్‌ బస్తీలో ఆప్‌ అభ్యర్థి సత్యేంద్ర కుమార్‌ జైన్‌ ముందంజ


ఓక్లా స్థానంలో ఆప్‌ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్‌ వెనుకంజ


గాంధీనగర్‌లో బీజేపీ అభ్యర్థి అర్విందర్‌ సింగ్‌ లవ్లీ ముందంజ


బద్లీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి దేవేంద్ర యాదవ్‌ వెనుకంజ

 


బిజ్వాసన్‌ స్థానంలో బీజేపీ అభ్యర్థి కైలాష్‌ గహ్లోత్‌ ముందంజ


పత్‌పర్‌గంజ్‌లో ఆప్‌ అభ్యర్థి అవధ్‌ ఓజా వెనుకంజ


గ్రేటర్‌ కైలాశ్​లో ఆప్‌ అభ్యర్థి సౌరభ్‌ భరద్వాజ్‌ ముందంజ


కాగా, దిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరిగింది. 60.42 శాతం ఓటింగ్ నమోదైంది. క్రితం ఎన్నికల కంటే ఇది 1.56 శాతం తక్కువ. మరి కొద్ది సేపట్లో ఢిల్లీ అధికారం ఎవరిదో తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bjp assembly delhi kejriwal byelections

Related Articles