VIRAL NEWS: పెళ్లిలో నల్లిబొక్క కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న చుట్టాలు !

నిజామాబాద్ జిల్లా నవీపేట్లో జరిగిన ఓ పెళ్లి లో మటన్ కర్రీ పెద్ద చిచ్చు రేపింది. పెళ్లి కొడుకు తరుపున వారికి మటన్ తక్కువ వేస్తున్నారని అసలు రచ్చ మొదలపెట్టారు


Published Aug 29, 2024 07:14:18 AM
postImages/2024-08-29/1724928338_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హీరో ..విలన్ కొట్టుకొని కమెడియన్ ని చంపేసినట్లుంది నిజమాబాద్ లో ఓ పెళ్లి వాళ్ల  బాగోతం..పెళ్లికెళ్లామా ...చుట్టాలతో ముచ్చట్లు పెట్టామా ...ఉన్న నగలన్నీ వేసుకొని సోకులకు పోయామా అన్నట్లుండాలి. పెట్టిన ముక్కలు మిగలకుండా తినేసి ...ఎప్పటిలాగే ఓ ఆర్టిఫిషియల్ నవ్వులు పూయిస్తూ తిరిగి ఇంటికి వచ్చేస్తే పోయేదే లేదు. అలా కాకుండా పెళ్లి లో నల్లిబొక్కలు కోసం పెద్ద యుద్దమే చేశారు వచ్చిన చుట్టాలు. పొట్టుపొట్టు కొట్టుకున్నారు కూడా. ఏకంగా కర్రలతో బుర్రలు బద్దలుకొట్టేసుకున్నారు కూడా.

నిజామాబాద్ జిల్లా నవీపేట యువతికి నందిపేట మండలానికి చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది.ఈ పెళ్లి తంతులో భోజనాలకు అందరు సిధ్దమయ్యారు. ఈ లోపు  పెళ్లి కొడుకు తరుపున వారికి మటన్ తక్కువ వేస్తున్నారని అసలు రచ్చ మొదలపెట్టారు. అదికాస్త వాదనలు మొదలై ...రచ్చ రచ్చ చేసి కర్రలతో కొట్టుకునే వరకు వచ్చింది.కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. దీంతో ఫంక్షన్ హాల్ రణరంగాన్ని తలపించింది.  పెళ్లి కూతురు , పెళ్లికొడుకు వేడుకలు ఏమో కాని ఈ గొడవలో దాదాపు 19 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇరు వైపుల వారు పోలీస్ కేసు పెట్టుకున్నారు. పంచాయితీ మాటలతో తేలేది కాదని ...తేలిపోయింది. పోలీసులే విచారణ జరిపి ..ఎవరు ఎన్ని మటన్ ముక్కలు వేయించుకున్నారో లెక్క తేలుస్తారట.


ఈ కొట్టుకున్న మహానుభావులందరిని దగ్గర్లో ఉన్న హాస్పటిల్ కు తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. దెబ్బలు తిన్న వాళ్లు , కొట్టిన వాళ్ల సంగతి ఏమో కాని ...నెటిజన్లు మాత్రం నవ్వుకుంటున్నారు. మటన్ కి కర్రలతో కొట్టుకున్నారా ...ఏంది రా ఈ ముచ్చట ..మటన్ బొక్కల కోసం కొట్టుకుంటార్రా  అంటు కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news marriage mutton nizamabad

Related Articles