విద్యార్థినిపై లైంగిక వేధింపుల విషయంపై మీడియా ప్రిన్సిపాల్‌ను ఆడగగా నిర్లక్ష్యంగా ప్రిన్సిపాల్ సమాధానం ఇచ్చారు.
న్యూస్ లైన్ డెస్క్: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థినిపై క్యాటరింగ్ వర్కర్ లైంగిక వేధింపులకు గురిచేశాడు. గత నెల సెలవులపై ఇంటికి వెళ్లిన బాలిక తిరిగి పాఠశాలకు వెళ్లకపోవడంతో, తల్లిదండ్రులకు అనుమానం వచ్చి అడగగా బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో పాలకుర్తి పోలీస్ స్టేషన్లో క్యాటరింగ్ వర్కర్‌పై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపుల విషయంపై మీడియా ప్రిన్సిపాల్‌ను ఆడగగా నిర్లక్ష్యంగా ప్రిన్సిపాల్ సమాధానం ఇచ్చారు. లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన పై ఆ విద్యార్థినిని తీసుకుని మంగళవారం తల్లిదండ్రులు పాలకుర్తిలోని గురుకుల పాఠశాలకు వచ్చి తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్‌కు వివరించారు. అందుకు ప్రిన్సిపాల్ సమాధానం చెప్పకపోవడంతోపాటు, తమపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తల్లిదండ్రులు వాపోయారు. ఉన్నతధికారులు ఈ ఘటనపై స్పందించి వెంటనే ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.