రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
న్యూస్ లైన్ డెస్క్: నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉందని వాతావరణ శాక హెచ్చరించింది. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఉరుములు, ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి.మీ. వేగంతో అక్కడ అక్కడ వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక అదేవిధంగా శుక్రవారం కొన్ని చోట్ల మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయిని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రవద్దని సూచించింది.
గురువారం వర్ష సూచన: కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్.
శుక్రవారం వర్ష సూచన: మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, భద్రాచలం.