ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో బబ్లూ అనే వ్యక్తి తన భార్య రాధికను ఆమె ప్రియుడు విశాల్ కుమార్ కు ఇచ్చి పెళ్లి జరిపించాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఈ మధ్య కాలంలో ప్రియుడుతో అక్రమసంబంధం పెట్టుకొని భర్త ను చంపేస్తున్న కేసులు మనం చాలా వింటున్నాం. ఎందుకొచ్చిన తంట అనుకున్నాడో ..ఏంటో తన భార్యకు తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి చేసేశాడు. ఈ విషయంకాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది.
ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో బబ్లూ అనే వ్యక్తి తన భార్య రాధికను ఆమె ప్రియుడు విశాల్ కుమార్ కు ఇచ్చి పెళ్లి జరిపించాడు. అయితే ఎందుకు చేశావని అడిగితే అతను చెప్పి ఆన్సర్ జనాలను షాక్ చేసింది. తన భార్య తనను చంపేయాలనే ఆలోచన వచ్చే లోపే ఈ నిర్ణయం తీసుకోవడం తనకు చాలా మంచిదనిపించందని అన్నాడు.అందులోను మీరట్ ఘటన (వారం రోజుల క్రితం ముస్కాన్ అనే యువతి తన భర్తను ప్రియుడితో కలిసి ముక్కలుగా నరికి డ్రమ్ములో దాయడం) చూసి నాకు భయమేసింది. ఈ విషయం వల్లే తను ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని తెలిపారు.
నా భార్యతో మాట్లాడాను...ఇద్దరి పిల్లల కోసం ఆలోచించమని అడిగాను ..ఆమె ప్రియుడిని వదులుకునేందుకు ఒప్పుకోలేదు. అతను మొదట కోర్టులో తన భార్య, ఆమె ప్రేమికుడి వివాహం జరిపించాడు. ఆపై వారిని ఒక ఆలయానికి తీసుకెళ్లాడు. అక్కడ వారు దండలు మార్చుకున్నారు. అయితే పిల్లల బాధ్యత తను తీసుకున్నట్లు తెలిపాడు.