దేశంలో బయోటిక్స్ వాడకం అనేది అపారంగా పెరుగుతుంది. ఐసిఎంఆర్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఏడాది ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రిలో 99,492 నమూనాలను ఐసిఎంఆర్ విశ్లేషణ చేసింది. ఈ
న్యూస్ లైన్ డెస్క్: దేశంలో బయోటిక్స్ వాడకం అనేది అపారంగా పెరుగుతుంది. ఐసిఎంఆర్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఏడాది ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రిలో 99,492 నమూనాలను ఐసిఎంఆర్ విశ్లేషణ చేసింది. ఈ నేపథ్యంలో యాంటీబయోటిక్స్ అతి వినియోగం కొంపముంచుతోందని తెలియజేస్తుంది. దగ్గు, జలుబు ఇలా ఏ చిన్న అనారోగ్య సమస్యకైనా యాంటీబయాటిక్స్ రాసిస్తున్నారు. యాంటీబయాటిక్స్ చిన్న సమస్యలు వచ్చినప్పుడే వాడడం వల్ల అసలు సమస్య వచ్చినప్పుడు ఇది పనిచేయకపోవడం పెద్ద సమస్యగా మారిందట.
ఇలా ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడడం వల్ల రాబోయే రోజుల్లో నాలుగు కోట్ల మందికి పైగా మృత్యువాత పడే అవకాశం ఉందట. 2025 నుంచి 2050 మధ్య యాంటీబయోటిక్స్ కు లొంగని వ్యాధుల వల్ల కోట్లాదిమంది మరణిస్తారట. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న 10 ఆనారోగ్య సమస్యల్లో ఇది కూడా ఒకటిగా తయారవ్వబోతుందట. ఇప్పటికే వైద్యులు ఎన్నోసార్లు హెచ్చరించిన ఎవరు వినడం లేదట.. భారత్ లో అవుట్ పేషెంట్లు 39 నుంచి 66% మందికి అలాంటి బయోటిక్స్ సిఫారసు చేయడం వైద్యులకు అలవాటైపోయింది. మరి దీనికి విరుగుడు లేదా అంటే ఉందని కూడా అంటున్నారు.
మనిషి జలుబు, దగ్గు తక్కువగా జ్వరం ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి పెంచే ఫుడ్ మాత్రమే తినాలట. ముఖ్యంగా దగ్గు, జలుబు ఉంటే గోరువెచ్చని నీళ్లను తాగాలట. అంతేకాకుండా పెరుగన్నం కూడా తింటే తొందరగా శక్తి పెరుగుతుందట. కానీ చాలామంది ఇలా చేయకుండా చిన్నగా జలుబు, దగ్గు, జ్వరం రాగానే యాంటీబయాటిక్స్ పారాసెటమాల్ లాంటి టాబ్లెట్లు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. దీనివల్ల తక్షణ ఉపశమనం కలిగినా కానీ ఆ తర్వాత కలిగించే నష్టాలు ఎక్కువగా ఉంటాయట.. కొంతమంది వైద్యులను సంప్రదించకుండానే పారాసెటమాల్ వేసుకుంటూ ఉంటారు.
ఇండియాలో ఔషధా నాణ్యతను పర్యవేక్షించే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పారాసెటమాల్ మత్తు బిళ్ళలు ప్రామాణిక నాణ్యతలేనివిగా పరిగణించాయి. దీనితో పాటు మరో 53 మందులను కూడా ఇందులో చేర్చింది. ఇలా ఇండియాలో ఉన్న నాణ్యత లేకుండా ఉండే మందులు ఎక్కువగా అమ్ముడవుతున్నాయట. ఈ మందులను జనం విచ్చలవిడిగా తమకు తాము వాడడం వల్ల అవి సైలెంట్ గా శరీరంపై దుష్ఫలితాలను చూపిస్తున్నాయట.