mallest Country : వరల్డ్ లో అతి తక్కువ జనాభా కలిగిన దేశం...వారు కూడా కోటీశ్వరులే !


అమెరికా లోని నెవాడా ఎడారిలో ఉన్న చాలా చిన్న స్వయం ప్రకటిత దేశం మోలోసియా .ఈ దేశం స్వతంత్ర సూక్ష్మ దేశంగా చెప్పుకుంటుంది.


Published Jun 05, 2025 09:48:00 PM
postImages/2025-06-05/1749140363_rBEeJGKlFDqAe1cqAAGJpteV8Y0508.png

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశం అనగానే కోట్ల జనాభా లెక్కలేస్తాం కాని జస్ట్ డబల్ డిజిటిల్ లో జనాలు ఉంటారంటే ..అబ్బ ఎంత ప్రశాంతంగా ఉంటారో అనిపిస్తుంది కదా అవును జస్ట్ 33 మంది మాత్రమే ఆదేశ జనాభా. వాళ్లు కూడా భయంకరమైన కోటీశ్వరులు. అసలు అలాంటి దేశం ఎక్కడుందో చూసేద్దాం.


అమెరికా లోని నెవాడా ఎడారిలో ఉన్న చాలా చిన్న స్వయం ప్రకటిత దేశం మోలోసియా .ఈ దేశం స్వతంత్ర సూక్ష్మ దేశంగా చెప్పుకుంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. మోలోసియాను 1977లో కెవిన్ బాగ్, అతని స్నేహితుడు ప్రారంభించారు. వారు తమ ఇంటిని కొత్త దేశంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. కెవిన్ ఈ దేశానికి ఇప్పటికి అధ్యక్షుడు. తన ఫ్యామిలీ తో కలిసి ప్రతిదీ నడుపుతున్నాడు. ఈ దేశానికి జెండా , జాతీయ గీతం, కరెన్సీ , చట్టాలు పుస్తకం అన్ని ఉన్నాయి. 33 మంది నివాసితులు కెవిన్ కుటుంబానికి చెందినవారు. ఇది చిన్నదే కావచ్చు, కానీ ఇది చాలా చక్కగా నిర్వహించబడింది.


తన ఇంటినే కొత్త దేశంగా మార్చడం అంత సులువైన పని కాదు. కాని తన ఫ్యామిలీ తో చాలా చక్కగా ఈ దేశ బాధ్యతలు నడిపిస్తున్నాడు కెవిన్. మోలోసియాలో ఒక చిన్న దుకాణం, లైబ్రరీ, స్మశానవాటిక, కొన్ని అధికారికంగా కనిపించే భవనాలు ఉన్నాయి. ఇక్కడ 33 మంది కోటీశ్వరులు. వారి ప్రైవసీ కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కెవిన్. టూరిస్ట్ లను కూడా అలౌ చేస్తారు కాని జస్ట్ రెండు గంటలు మాత్రమే దేశాన్ని చుట్టి రావాలి. మీరు ఓ పెద్ద కంట్రీ చూడ్డానికి వెళ్తే ఏమైతే రూల్స్ పాటించాలో ఇక్కడ కూడా అవే రూల్స్ . మీరు ఈ దేశాన్ని సందర్శించినట్లు స్టాంప్ కూడా వేస్తారు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశంగా హ్యాష్ ట్యాగ్ వరల్డ్ స్మాల్ కంట్రీ పేరుతో ఫుల్ వైరల్ అవుతుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu america

Related Articles