VIRAL: సార్ ...ఏనుగు సార్ షాపింగ్ కి వచ్చారా సార్... వైరల్ వీడియో !

ఏకంగా 9 బ్యాగుల స్వీట్ రైస్ , సాండ్ విచ్ , అరటిపండ్లను లాంగేంచిసి ఫుల్ గా ఎంజాయ్ చేసింది. 


Published Jun 05, 2025 09:18:00 PM
postImages/2025-06-05/1749138733_cnnl19jb21wb25lbnrzl2ltywdll2luc3rhbmnlcy9jbwjob2xjm3ywmdfim2i2btnqdthucny0l19jb21wb25lbnrzl2fydgljbguvaw5zdgfuy2vzl2ntymhtmnd2otawmncyn3frymq0zgv5m2qjpg6840ceeb9f369.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సరదాలు మనుషులేకేనా ...జంతువులకి ఉండవా...ఎంతకని అలా అడవుల్లోనే తిరుగుతాయి..వాటికి ఏసీ కావాలి...వాటికి  షాపింగులు ..షికార్లు కావాలని అనిపిస్తుందిగా ..అందుకే థాయిలాండ్ లో ఓ స్టన్నింగ్ విషయం జరిగింది. ఓ భారీ ఏనుగు సూపర్ మార్కెట్లో కి ఎంట్రీ ఇచ్చింది. తన కంటికి కనిపించిన టేస్టీ ఫ్రూట్స్ ...ఫుడ్ ఏం కనిపిస్తే అది ఫుల్ గా బఫే లా భోంజేసేసింది. ఏకంగా 9 బ్యాగుల స్వీట్ రైస్ , సాండ్ విచ్ , అరటిపండ్లను లాంగేంచిసి ఫుల్ గా ఎంజాయ్ చేసింది. 


సరదాగా అంటున్నా...ఎంత ఆకలేసిందో ఏమో..సాధారణం గా ఏ వన్యజీవులైనా జనాల్లోకి రావాలంటే భయపడతాయి. వాటికి ఎక్కడ ఏ హాని చేస్తామో అని ...కాని ఇక ఏం జరిగినా పర్లేదనుకుందో ఏమో...ఆకలేసి ఇటు షాపింగ్ మాల్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఏనుగు. తన కంటికి నచ్చినవన్నీ తినేసి చాలా కామ్ గా అటు ఇటు తిరిగుతూ ఉంది. తన పని చూసుకొని అక్కడి సైలెంట్ గా వెళ్లిపోయింది. షాపులో ఫుడ్ కి నష్టం కలిగింది కాని ..పెద్దగా ఏం భీభత్సం చెయ్యలేదు. 


అయితే భారీ సైజున్న ఏనుగు సూపర్ స్టోర్ లోకి రావడంతో కస్టమర్లు, షాప్ ఓనర్ షాక్ కి గురయ్యారు. జనాలు తమపై ఎక్కడ ఏనుగు దాడి చేస్తుందో అని భయపడ్డారు కాని ఎవ్వరిని ఏం చెయ్యకుండా తనకు కావాల్సినవి తినేసి ...చక్కగా బిల్ లేకుండా బై బై చెప్పేసి బయటకు చెక్కేసింది. సూపర్ స్టోర్ సమీపంలోనే ఓ పార్క్ ఉంది. అక్కడే ఈ ఏనుగు ఉంటుంది. బాగా ఆకలి వేసిందో ఏమో కానీ.. పార్క్ నుంచి వీధుల్లోకి వచ్చేసింది. ఈ వీడియో వైరల్ అవుతుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-video elephant thailand

Related Articles