kanappa: కన్నప్ప సినిమా విడుదల వాయిదా...సారీ చెప్పిన విష్ణు !

వీఎఫ్ ఎక్స్ వర్క్ కోసం మరింత టైం పట్టే అవకాశముందని అందుకే వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.


Published Mar 29, 2025 06:17:00 PM
postImages/2025-03-29/1743252567_kanna.gif.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  కన్నప్ప సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్న ట్లు  మంచు విష్ణు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 25న ఈ మూవీ రిలీజ్ కావల్సి ఉండగా ..ఈ రోజు నటుడు , నిర్మాత మంచువిష్ణు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ సినిమా విడుదల లేటు అవుతుందని ప్రకటించారు. వీఎఫ్ ఎక్స్ వర్క్ కోసం మరింత టైం పట్టే అవకాశముందని అందుకే వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.


" కన్నప్ప సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నాం. మూవీ యూనిట్ మంచి ఔట్ పుట్ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నాం. గ్రాఫిక్స్ పనులు చాలా వారాలు పట్టే అవకాశం ఉంది. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ను రిలీజ్ చేస్తామని మంచు విష్ణు  నోట్ లో విడుదల చేశారు.'కన్నప్ప'కు ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ముఖేశ్ కుమార్ బాలీవుడ్ లో మహాభారతం సీరియల్ డైరక్టర్ . సో దీనిపై చాలా అంచనాలున్నాయి. ఈ ఎపిక్ మూవీని మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ రుద్రుడి పాత్ర‌ చేస్తుండగా... మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ఇతర పాత్రలు పోషించారు.

newsline-whatsapp-channel
Tags : movie-news manchu-vishnu

Related Articles