ఖమ్మం, నల్గొండ మంత్రులే సీఎం సభ్యత్వాన్ని రద్దు చేసేలా ఉన్నారని ఆయన అన్నారు. సీఎం బెదిరింపులకు భయపడే వారు లేరని, సబితా ఇంద్రారెడ్డిని అవమానించిన సీఎం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కానుందని మంత్రులు మీడియా చిట్‌చాట్‌లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్ల సభ్యత్వం రద్దు కావడం పక్కన పెడితే.. రేవంత్ అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చే సరికి ఆయన సభ్యత్వం రద్దు అయ్యేలా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
ఖమ్మం, నల్గొండ మంత్రులే సీఎం సభ్యత్వాన్ని రద్దు చేసేలా ఉన్నారని ఆయన అన్నారు. సీఎం బెదిరింపులకు భయపడే వారు లేరని, సబితా ఇంద్రారెడ్డిని అవమానించిన సీఎం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని అన్నారు. అందుకే మాట్లాడలేందుకు నేరుగా మీడియా పాయింట్ వద్దకే వచ్చానని కౌశిక్ రెడ్డి అన్నారు.
హుజురాబాద్ ప్రజలకు రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. తన జీతం నుంచి రూ.4 లక్షలు అగ్నిప్రమాద బాధితులకు ఇచ్చానని ఆయన తెలిపారు. హుజురాబాద్‌లో పొన్నం ప్రభాకర్ మిత్రుడు ప్రెస్ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని ఆయన తెలిపారు.