పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి తీసిన సినిమాలేవీ వర్కవుట్ కాలేదు. పీకల్లోతు అప్పులు కష్టాలు. పెద్ద పెద్ద హీరోలు కూడా ఈ భారీ ప్రొడక్షన్ ను నిలబెట్టలేకపోతున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సౌత్ లో లైకా ప్రొడక్షన్స్ గురించి1అందరికి తెలుసు. చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్. దళపతి విజయ్ తో కత్తి లాంటి బ్లాక్ బాస్టర్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఎన్నో బిగ్ ప్రాజెక్ట్స్ ను ప్రొడ్యూస్ చేసి సక్సస్ అయ్యింది. అయినా లైకాకు కష్టాలు తప్పలేదుజ మొదట్లో అన్ని బాగా వర్కవుట్ అయ్యాయి. కాని తర్వాత తర్వాత పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి తీసిన సినిమాలేవీ వర్కవుట్ కాలేదు. పీకల్లోతు అప్పులు కష్టాలు. పెద్ద పెద్ద హీరోలు కూడా ఈ భారీ ప్రొడక్షన్ ను నిలబెట్టలేకపోతున్నారు.
కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ తీసిన సినిమాలు లైకాను కొట్టిన దెబ్బ అలాంటి ఇలాంటిది కాదు. శంకర్, లైకా కాంబోలో 2018లో టేకప్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ రోబో 2.0 మూవీ. అది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఈ సినిమాకే లైకా 500 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. రజినీ కాంత్ లాంటి స్టార్ ఉన్నా ..లైకా ను కాపాడలేకపోయారు. ఇదే లాస్ అంటే ఇండియన్-2 బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. అజిత్ లేటెస్ట్ మూవీ విడాముయర్చి కూడా సక్సస్ అనుకుంటే హాలివుడ్ నుంచి కాపీ కొట్టేశారంటూ కాపీ రైట్ ఇష్యూ వచ్చింది.దీంతో వారికి భారీ డబ్బులు చెల్లించింది లైకా సంస్థ. తీరా చూస్తే సినిమా డిజాస్టర్ .
ప్రజెంట్ చేతిలో ఉన్న లూసిఫర్ 2, సందీప్ కిషన్ తో స్టార్ హీరో కొడుకు జేసన్ సంజయ్ డైరక్టర్ గా వస్తున్న సినిమా ఉంది. ఇవి కంప్లీట్ అయ్యాక ఈ సినిమా బిజినెస్ ల నంుచి తప్పించుకుంటారని టాక్.