మా ఇద్దరి మధ్య సునీతా విలియమ్స్ విధి నిర్వహణలో చూపుతున్న నిబధ్దత గురించే ప్రస్తావన వచ్చిందని తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఎట్టకేలకు సునీతా విలియమ్స్ భూమ్మీదకు చేరుకోబోతున్నారు. ఈ సంతోషంతోనే నరేంద్రమోదీ సునీతా విలియమ్స్ కు లేఖ రాశారు. నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. భారత ప్రజల తరుపున శుభాకాంక్షలు తెలుపుతూ ..ఈ రోజు తను వ్యోమగామి మైక్ మాసిమినోను కలిశానని తెలిపారు. మా ఇద్దరి మధ్య సునీతా విలియమ్స్ విధి నిర్వహణలో చూపుతున్న నిబధ్దత గురించే ప్రస్తావన వచ్చిందని తెలిపారు.
సునీతా విలియమ్స్ విధి నిర్వహణలో చూపుతున్న నిబద్ధత పట్ల ఎంతో గర్వపడుతున్నామని పరస్పరం చెప్పుకున్నామని అన్నారు. 140 కోట్ల మంది భారతీయులు సునీతా విలియమ్స్ విజయాల పట్ల ఎంతో గర్వపడుతున్నారని చెప్పారు. సునీతా విలియమ్స్ ఆరోగ్యం కోసం , ఆమె మిషన్ లో విజయం సాధించడం కోసం భారత్ ప్రజలు ప్రార్ధిస్తున్నారని చెప్పారు. సునీతా విలియమ్స్ మీ తల్లి మీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారని తెలిపారు.దివంగత దీపక్ భాయ్ (సునీతా తండ్రి) ఆశీస్సులు సునీతా విలియమ్స్‌తో ఎప్పటికీ ఉంటాయని అన్నారు. సునీతా విలియమ్స్ తిరిగి వచ్చిన తర్వాత భారత్‌కు రావాలని, ఆమెను చూడటానికి ఇక్కడి వారంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. సునీతా విలియమ్స్ భర్తకు శుభాకాంక్షలు తెలిపారు.