SS Rajamouli: ఆ రచయిత మరణంపై రాజమౌళి భావోద్వేగ పోస్ట్ !

ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ మలయాళ వెర్షన్లకు ఆయనతో కలిసి పనిచేసినందుకు కృతజ్ఞతలు. ఓం శాంతి" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


Published Mar 18, 2025 10:41:00 AM
postImages/2025-03-18/1742274781_119138669.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మలయాళం సినిమాలు ఆర్ట్ సినిమాలంటారు...చాలా పదునైన పదాలు...ఎంతో లోతైన అర్ధాలు ...ప్రశాతంగా కనిపించే స్లో నెరేషన్ ..చాలా మందికి ఇష్టం . మలయాళంలో చాలా మంచి రచయితలున్నారు. వారిలో మంకొంబు గోపాలకృష్ణన్ ఒకరు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన సోమవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతి పై మలయాళం ఇండస్ట్రీ మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీల్లో పెద్దలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. అంతేకాదు..తెలుగు ఇండస్ట్రీ లో రాజమౌళి ఆయన మరణం పై ఇలా ట్విట్ చేశారు.
"మంకొంబు గోపాలకృష్ణన్ సర్ మరణవార్త బాధించింది. ఆయన చిరకాల వాంఛనీయ సాహిత్యం, కవిత్వం, సంభాషణలు ఆయనపై శాశ్వత ముద్ర వేశాయి. ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ మలయాళ వెర్షన్లకు ఆయనతో కలిసి పనిచేసినందుకు కృతజ్ఞతలు. ఓం శాంతి" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rajamouli social-media malayalam-film-industry

Related Articles