పెళ్లికూతురులా ముస్తాబై చేతిలో ప్లకార్డుతో రోడ్డుపై నిలుచుంది. ఆ కార్డుపై ‘ప్రభుత్వ ఉద్యోగం ఉన్న పెళ్లికొడుకు కోసం చూస్తున్నా’ అని రాసి చేతుల్లో పట్టుకుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పెళ్లికి పిల్ల దొరకడం అబ్బాయిలకి కష్టం...అమ్మాయిలకి గవర్నమెంట్ జాబ్ ఉన్న కుర్రాడు దొరకడం కష్టం . ఇదో యూనివర్సల్ ప్రాబ్లమ్ . ఒకప్పుడు ఆడపిల్లలకు బోలెడు వంకలు పెట్టేవారట. అదంతా ఇప్పుడు రివర్స్ చేశాడు దేవుడు..ఇప్పుడు పెళ్లి సంబంధాల్లో చాలా వరకు నో చెప్పేది ఆడపిల్లలే. అయితే వాళ్లకి ఉన్న ఫస్ట ప్రయారిటీ గవర్నమెంట్ జాబ్ ఉన్న వ్యక్తి. గవర్నమెంట్ జాబ్ అయితే సెక్యూరిటీ ...బెస్ట్ రిటైర్మెంట్ ప్లాన్స్ ...ఇలా చాలా కలలతో లైఫ్ పార్ట్ నర్ ను వెతుక్కుంటున్నారు. దీని పై సోషల్ మీడియాలో చాలా ప్రాంక్స్ చేస్తున్నారు కూడా.
రీసెంట్ గా ఓ యువతి సెటైరికల్ గా ఫ్రాంక్ వీడియో చేసింది. పెళ్లికూతురులా ముస్తాబై చేతిలో ప్లకార్డుతో రోడ్డుపై నిలుచుంది. ఆ కార్డుపై ‘ప్రభుత్వ ఉద్యోగం ఉన్న పెళ్లికొడుకు కోసం చూస్తున్నా’ అని రాసి చేతుల్లో పట్టుకుంది. అసలు రోడ్డున వచ్చి పోయేవారిని మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా అంటూ అడుగుతూ రోడ్డంతా గాలించారు. నల్లగా ఉన్నా పర్లేదు గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు అంటూ వెతికింది.
చివరకు ఓ మధ్యవయస్కుడు ఆమె దగ్గరకు వచ్చి తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పడంతో సిగ్గుపడుతూ పెళ్లికి ఒప్పుకుంటుంది. అబ్బాయి ఎలా ఉన్నా పర్లేదు కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉండాలని తన తండ్రి సూచించాడని ఆ యువతి చెప్పింది. ఈ వీడియో ఓ ప్రాంక్ అని ...ప్రస్తుతం అమ్మాయిలు ఇలానే ఉన్నారని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
What is she doing? pic.twitter.com/mNkuhz2whk — ︎ ︎venom (@venom1s) March 17, 2025