Sourav Ganguly: క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ సినిమాల్లో నటిస్తున్నారా !

గంగూలీ ఈ వెబ్ సిరీస్ లో నటించడంలేదని, కేవలం ప్రమోషన్ లో మాత్రమే భాగం పంచుకున్నాడని స్పష్టమైంది.  బెంగాల్ చాప్టర్ వెబ్ సీరిస్ "ఖాకీ " ది బీహార్ చాప్టర్ కు సీక్వెల్ గా వస్తుంది


Published Mar 17, 2025 04:37:00 PM
postImages/2025-03-17/1742209711_b4c1gi68sauravganguly625x30006March25.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ సినీ ప్రవేశం చేస్తున్నాడా అంటే అవును అనేలా ఉంది ...ఈ పోస్టర్ . గంగూలీ అభిమానులు ఈ పోస్టర్ చూసి స్టన్ అయిపోతున్నారు. అసలు కథేంటి అంటే రీసెంట్ గా గంగూలీ పోలీస్ డ్రెస్ తో ఓ వెబ్ సీరిస్ ప్రమోట్ చేస్తున్న పిక్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. దీంతో ఫ్యాన్స్ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి.


 ఈ వీడియోను బట్టి... గంగూలీ ఈ వెబ్ సిరీస్ లో నటించడంలేదని, కేవలం ప్రమోషన్ లో మాత్రమే భాగం పంచుకున్నాడని స్పష్టమైంది.  బెంగాల్ చాప్టర్ వెబ్ సీరిస్ "ఖాకీ " ది బీహార్ చాప్టర్ కు సీక్వెల్ గా వస్తుంది. ఐపీఎస్ అధికారి అమిత్ లోథా లైఫ్ లోని రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకొని ఈ వెబ్ సీరిస్ తీస్తున్నారు. అయితే ఈ సీరిస్ ను ప్రమోట్ చెయ్యడానికి గంగూలీ ఇలా పోలీస్ డ్రెస్ లో కనిపించారు. 'బీహార్ చాప్టర్' గతంలో విడుదలై సంచలనం సృష్టించింది. ఇప్పుడు 'బెంగాల్ చాప్టర్' కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి. సో గంగూలీ యాక్టింగ్ చెయ్యడం లేదు జస్ట్ ప్రమోషన్స్ లో మాత్రమే పాల్గొన్నారు.

 

Related Articles