రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
న్యూస్ లైన్ సినిమా: తెలుగు సినీ రంగానికి గద్దర్ అవార్డులు ఇస్తామని తాము చేసిన ప్రతిపాదన పట్ల టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తీవ్ర విచారకరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై సినీ పరిశ్రమ మౌనంగా ఉండడం విచారకరమన్న రేవంత్ రెడ్డి, దీనిపై సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరమన్నారు.
రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రజా గాయకుడు, నిరంతర శ్రామిక కళాకారుడు గద్దర్ పేరుతో అవార్డులివ్వడం సముచితమని, ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన ధన్య వాదాలు అని తెలిపారు. తెలుగు పరిశ్రమ తరఫున ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేలా బాధ్యత తీసుకోవాలని సోషల్ మీడియాలో చిరంజీవి పోస్టు చేశారు.