Mika Singh: సైఫ్ ను కాపాడిన ఆటో డ్రైవ‌ర్‌కు రూ.1 ల‌క్ష బహుమతి !

జనవరి 16 న తన బాంద్రా ఇంట్లో దాడికి గురైన తర్వాత తీవ్ర గాయాలతో  రక్తమోడుతున్న సైఫ్ ను రానా తన ఆటోలో హాస్పటిల్ కు తీసుకెళ్లాడు.


Published Jan 23, 2025 12:13:00 PM
postImages/2025-01-23/1737614717_mikasingh22150820316x90.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బాలీవుడ సైఫ్ అలీఖాన్ ప్రాణాలను కాపాడిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాకు పంజాబీ గాయకుడు మికా సంగ్ రూ. 1 లక్ష రివార్డు ప్రకటించారు. జనవరి 16 న తన బాంద్రా ఇంట్లో దాడికి గురైన తర్వాత తీవ్ర గాయాలతో  రక్తమోడుతున్న సైఫ్ ను రానా తన ఆటోలో హాస్పటిల్ కు తీసుకెళ్లాడు.


పంజాబీ గాయకుడు త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆటో డ్రైవర్‌ను ప్రశంసిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. అతనికి రూ. 1 లక్ష బహుమతిని ప్రకటించారు. భారత్ కు చాలా ఇష్టమైన స్టార ను కాపాడినందుకు అతను కనీసం 11 లక్షల అవార్డుకు అర్హుడని నేను గట్టిగా నమ్ముతున్నాను. నా తరుపున లక్ష బహుమతిగా ఇస్తున్నానంటు తెలిపారు . సైఫ్ తను డిశ్చార్జ్ అయ్యే ముందు ఆటో డ్రైవర్‌ను ఆసుపత్రిలో కలిశారు. రానాను కౌగిలించుకుని ధన్యవాదాలు తెలిపాడు. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ కూడా రానాను ఆశీర్వదించారు. అలాగే అత‌నికి సైఫ్ రూ.50వేలు ఇచ్చారు.


ఈ దాడికి పాల్ప‌డిన‌ బంగ్లాదేశ్ వాసి మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (30)ని అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం అతన్ని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయ‌స్థానం అత‌నికి ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu saif-alikhan auto-ride-booking

Related Articles