ఈ సంవత్సరం కూడా నీకు విజయం అంతులేని ఆనందాలు నిండి ఉండాలని ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఏపీ నారా లోకేశ్ పుట్టిన రోజు సంధర్భంగా తల్లి , భార్య నారా బ్రాహ్మణి ఆయనకు బర్త్ డే విషఎస్ తెలిపారు. తన సోషల మీడియా అకౌంట్ ద్వారా తన స్వీట్ హార్ట్ కు విషెస్ తెలిపారు.
"పుట్టినరోజు శుభాకాంక్షలు నారా లోకేశ్. మన రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు పెట్టుబడుల కోసం దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొంటున్న నీకు నా ఆశీస్సులు ఉంటాయి. ఈ సంవత్సరం కూడా నీకు విజయం అంతులేని ఆనందాలు నిండి ఉండాలని ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ చేశారు.
తన భార్య కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో తన భర్త కు విషెస్ తెలిపారు. మీరు చేసే ప్రతి పనికి నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా ఈ రోజు మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు. ఈ ఏడాది కూడా మీకు అధ్భుతంగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే లవ్ ఆఫ్ మై లైఫ్ అని బ్రాహ్మణి పోస్ట్ చేశారు.