అసలు ఎంత లేవని మనం అనుకున్నా...చూస్తాం ..భయపడతాం. కాని ఇప్పుడు మేం చెప్తునన్న స్టోరీ మాత్రం రియల్ భూత్ స్టోరీ.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క : దెయ్యాలు ఉన్నాయా ..లేవా ..అసలు ఎలా ఉంటాయి. చాలామంది దెయ్యాలంటే భయపడతారు. హర్రర్ మూవీస్ చూసేందుకు ఇష్టపడతారు. అసలు ఎంత లేవని మనం అనుకున్నా...చూస్తాం ..భయపడతాం. కాని ఇప్పుడు మేం చెప్తునన్న స్టోరీ మాత్రం రియల్ భూత్ స్టోరీ.
కేరళలో భూత్ బంగ్లాగా చెప్పుకొనే బోనాకాడ్ బంగ్లాను 1951లో బ్రిటిష్ వాళ్లు నిర్మించారు. దీనని 25 GB బంగ్లా అని పిలుస్తారు. ఈ బంగ్లా కట్టిన ఆంగ్లేయుడు టీ తోట నిర్వాహకుడు. అతను తన కుటుంబంతో ఈ ఇంట్లో నివసించేవాడు. ఒక రోజు అతని బిడ్డ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ తర్వాత అతను తన భార్యతో కలిసి లండన్ వెళ్లిపోయాడు. ఈ బంగ్లా నుంచే బేతాళ కథలు పుట్టాయి. అప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది.
కిటికీ దగ్గర ఒక అమ్మాయిని చూడగానే అద్దాలు పగలగొట్టిన శబ్దం వచ్చిందనీ, బాలిక అరుస్తున్న శబ్దం వినిపించిందనీ, బంగ్లాలో దెయ్యం కనిపించిందనీ ఇలా ఎన్నో కథలు. ఒక రోజు కట్టెలు కొట్టడానికి వెళ్లిన స్థానిక యువతి ..తిరిగి వచ్చిన తర్వాత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. చదువుకోని ఆ అమ్మాయి సడన్ గా ఇంగ్లీష్ లో మాట్లాడేది . చదవడం , రాయడం కూడా చేయగలనని చెప్పింది. దాంతో చనిపోయిన పిల్ల దెయ్యం ఆ అమ్మాయి కి పట్టిందని చాలా మంది నమ్మారు.
బోనాకాడ్ రాజధాని తిరువనంతపురం నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రాంతంలో రెస్టారెంట్ లు , రిసార్ట్ లు లేవు. బంగ్లా తలుపులు , కిటికీలు పగలగొట్టి కొన్ని చెక్క పలకలతో తలుపులు మూశారు. రోజూ రాత్రి ఇక్కడకు వచ్చి తిరుగుతుందని స్థానికులు చెబుతారు.