ఈ డబ్బును కట్టలేని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రామ్ గోపాల్ వర్మ కు అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు గట్టి షాక ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్ జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాక మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి రూ. 3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ డబ్బును కట్టలేని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది.
2018 లో మహేష్ చంద్ర అనే వ్యక్తి ఈ చెక్ బౌన్స్ కేసులో భాగంగా కోర్టు ఈ రోజు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. గత ఏడేళ్లుగా కోర్టు లో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడేళ్లులో ఏనాడు కోర్టులో హాజరు కాలేదని తెలుస్తుంది. దీంతో కోపంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి ఇలా తీర్పుని ఇచ్చింది.
తనకు పరిశ్రమ ఇచ్చిన అవకాశాల్ని తాను ఉపయోగించుకోలేదని అన్నారు. సత్య సినిమా లాంటి సినిమాలు నేనే తీశానా అనే అనుమానం వస్తుంది. పరిశ్రమపై మరింత శ్రధ్ధ తీసుకోవాలి. మంచి సినిమాలు తియ్యాలి అంటూ తెలిపారు.