ఈ సినిమాలో మహారాణి యేసుబాయిగా రష్మిక కనిపిస్తుంది.ఇక మహారాణి పాత్రలో రాజరికపు లుక్ లో రష్మికా మందన్న అందరిని ఆకట్టుకుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: రష్మిక మందన్నను గ్లామర్ పాత్రలోనే చూసి ఉంటారు.హాట్ హాట్ గా కనిపించిన ఈ బ్యూటీ ..తాజాగా లుక్ అందరికి ఆశ్చర్యపరుస్తుంది. రష్మిక మందన్న లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం ఛత్రపతిలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. సంభాజీ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో మహారాణి యేసుబాయిగా రష్మిక కనిపిస్తుంది.ఇక మహారాణి పాత్రలో రాజరికపు లుక్ లో రష్మికా మందన్న అందరిని ఆకట్టుకుంది.
మహారాణి యేసుబాయిని "స్వరాజ్యపు గర్వం" అని ఆమె పోస్ట్ చేసింది. ఇక ఈసినిమా ట్రైలర్ జనవరి 22న రిలీజ్ కాబోతోంది. కాని పుష్ప-2 లో చూసిన రష్మిక ..ఇప్పుడు యేసు బాయి రష్మిక ఒకటేనా అనింపించేంత అందంగా ఉంది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మరాఠా సామ్రాజ్యం యొక్క సంస్కృతి , చరిత్ర విలువలు అన్వేషించడానికి ఈ పాత్ర తనకు చాలా సహాయపడిందని తెలిపారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన, దినేష్ విజన్ నిర్మించిన ఛత్రపతి చిత్రం ఫిబ్రవరి 14, 2025న థియేటర్లలో విడుదల కానుంది.