రాజమౌళితో సినిమా చేస్తే ...తర్వాత వాళ్లు ఏం చేసినా ఫెయిల్ అవుతారు. మరో సారి ఈ రాజమౌళి శాపం నిజం అని రుజువయ్యింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇండస్ట్రీ లో జనాలు ఎంత పాష్ గా ఉంటారో..అంతే నమ్మకాలు కూడా ఉంటాయి. వాటిలో ఒకటి రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోల తరువాతి సినిమాల ఫలితాలపై ఉండే నమ్మకం. రాజమౌళితో సినిమా చేస్తే ...తర్వాత వాళ్లు ఏం చేసినా ఫెయిల్ అవుతారు. మరో సారి ఈ రాజమౌళి శాపం నిజం అని రుజువయ్యింది.
ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల ఉదాహరణలు ఈ నమ్మకానికి బలం చేకూర్చినవి. ఉదాహరణకు, ప్రభాస్ నటించిన బాహుబలి 2 తారాస్థాయిలో విజయవంతం అయినప్పటికీ, సాహో అంతగా ఆకట్టుకోలేదు. రామ్ చరణ్ RRR తర్వాత ఆచార్య బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది. దేవర యావరేజ్ గా నిలిచింది. చాలా మంది దగ్గర ఈ రాజమౌళి సినిమా తర్వాత ఫెయిల్ అయిన వారున్నారు.
ఇటీవలి కాలంలో, క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ కూడా ఈ చర్చలో భాగమయ్యాడు. రాజమౌళి మరియు వార్నర్ కలిసి ఓ యాడ్‌లో నటించారు. అయితే ఆ తర్వాత వార్నర్ కు వేలం లో పెద్దగా డబ్బు రాలేదు. అనుకున్నంతగా వేలంలో డబ్బులు రాలేదు. నెటిజన్లు జోక్ లు , మీమ్స్ చేయడం ప్రారంభించారు. రాజమౌళి శాపం వార్నర్ ను కూడా వెంటాడింది.వార్నర్‌పై వచ్చిన విమర్శలు మాత్రం క్రికెట్ మరియు సినిమా రెండు భిన్న రంగాలు కావడం వల్ల ఆయన ప్రదర్శనపై ప్రభావం చూపుతాయి. సో దాన్ని దీన్ని కలిపొద్దని చెప్పేవాళ్లు ఉన్నారు.