కలెక్టర్ స్మిత సబర్వాల్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఆమె ఏ జిల్లా కలెక్టర్ చేసిన తనదైన మార్క్ చూపిస్తుంది. ప్రజలతో అద్భుతంగా మింగిల్ అవుతూ ప్రభుత్వాలు అందించే
న్యూస్ లైన్ డెస్క్: కలెక్టర్ స్మిత సబర్వాల్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఆమె ఏ జిల్లా కలెక్టర్ చేసిన తనదైన మార్క్ చూపిస్తుంది. ప్రజలతో అద్భుతంగా మింగిల్ అవుతూ ప్రభుత్వాలు అందించే పథకాలను ప్రజలకు అందేలా చేస్తుంది. అంతేకాదు డైనమిక్ ఆఫీసర్ అనే పేరుకు బ్రాండ్ అంబాసిడర్ కలెక్టర్ స్మితా సబర్వాల్ అని చెప్పవచ్చు. ఈమె కేవలం వర్క్ పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అద్భుతమైన ఫాలోయింగ్ పెంచుకుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది.
అలాంటి స్మితా సబర్వాల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తెలంగాణ రాష్ట్రంలో అర్బన్, రూరల్ స్థానిక సంస్థలకు ఎక్కువగా ఆదాయం పెంచడానికి మీరేమైనా ఐడియాలు ఇవ్వాలని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబెర్ సెక్రెటరీ స్మితా సబర్వాల్ సోషల్ మీడియా వేదికగా కోరింది. ఆదివారం ఇదే అంశంపై ఐడియా థాన్ పేరుతో ట్విట్ చేసింది.
https://x.com/SmitaSabharwal/status/1824365136380911977?s=19
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ పెంచే మంచి ఐడియాను మీరు ఇవ్వండి లక్ష రూపాయలు గెలుచుకోండి అంటూ ఒక ట్వీట్ చేసింది. మీరు పంపించాల్సిన ఐడియాలను tgsfc2024@gmail.comమెయిల్ కు ఐడియాలు పంపాలని కోరింది. ఈనెల 30 వరకు టైం ఉందని గుడ్ ఐడియా ఇచ్చిన వారికి లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ అందజేస్తామని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఆమె ఇలా టాస్క్ విసరడంతో అది నెట్టింటా విపరీతంగా వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఒక మంచి ఐడియా ఇచ్చి లక్ష రూపాయలు గెలుచుకోండి.