Brahmanandam:నవ్వుల రారాజు కంట్లో కన్నీరు..కారణమిదే.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి కమెడియన్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్న కమెడియన్ బ్రహ్మానందం. మనల్ని కడుపుబ్బా నవ్వించడమే కాకుండా ఆయన మీమ్స్ ద్వారా లక్షలాది మందికి జీవితాలను అందిస్తున్నాడు. కేవలం ఆయన మీమ్స్ వాడుకొని గూగుల్ ద్వారా సంపాదించే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి నవ్వుల హాస్యబ్రహ్మ  కంట్లో కన్నీరు చూడడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆయన కన్నీరు ఎందుకు పెట్టుకున్నారు.. ఆయనకు ఎవరు గుర్తుకు వచ్చారు అనే వివరాలు చూద్దాం.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-19/1721396856_comedy.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి కమెడియన్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్న కమెడియన్ బ్రహ్మానందం. మనల్ని కడుపుబ్బా నవ్వించడమే కాకుండా ఆయన మీమ్స్ ద్వారా లక్షలాది మందికి జీవితాలను అందిస్తున్నాడు. కేవలం ఆయన మీమ్స్ వాడుకొని గూగుల్ ద్వారా సంపాదించే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి నవ్వుల హాస్యబ్రహ్మ  కంట్లో కన్నీరు చూడడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆయన కన్నీరు ఎందుకు పెట్టుకున్నారు.. ఆయనకు ఎవరు గుర్తుకు వచ్చారు అనే వివరాలు చూద్దాం.

బ్రహ్మానందం కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగలరు. ఇప్పటికే వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందారు.  ఇలాంటి బ్రహ్మానందం తాజాగా దివంగత కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే సుబ్రహ్మణ్యం 2013 డిసెంబర్ 7న అనారోగ్య సమస్యల వల్ల మరణించారు. అయితే బ్రహ్మానందం కు మరియు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కు మధ్య మంచి బాండింగ్ ఉంది.

ఇద్దరు ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా ఉండేవారు. ధర్మవరం చనిపోయిన రోజు బ్రహ్మానందం చాలా ఏడ్చారు. ఆయన గురించి తాజాగా ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూ మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. సుబ్రహ్మణ్యంని నేను ధర్మన్నా అని పిలిచేవాడిని. తాను చనిపోయే ముందు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడాడు.  చివరిసారి ఆ ఫోన్లో ఒక చిన్న రిక్వెస్ట్ రా నువ్వు నన్ను చూడడానికి అస్సలు రావొద్దు.నన్ను నువ్వు చూస్తే తట్టుకోలేవు.

అంతకు ముందు చూసినట్టు ఇప్పుడు నేను  లేను అంటూ చెప్పాడు.  చివరిసారిగా ఎలా చూసావో దాన్ని మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకో నా దగ్గరికి రావద్దు అని అన్నాడు.  చివరికి నేను ఎలాగోలా వస్తానని గట్టిగా అడిగేసరికి డిసెంబర్ నెలలో వద్దువు లే అన్నాడు.అప్పటివరకు నా ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పాడు..అంటూ చివరిసారిగా ఒక పద్యం పాడుతూ నేను త్వరలోనే వచ్చేస్తా మనిద్దరం కలిసి మళ్ళీ నటిద్దామని చెప్పి  చివరిసారిగా నాతో మాట్లాడారని చెప్పి బ్రహ్మానందం ఎమోషనల్ అయ్యాడు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tollywood brahmanandam dharmavarapu-subramanyam comedians

Related Articles