G ECET 2025: టీజీ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ !


తెలంగాణ ఈసెట్‌ -2025 కౌన్సెలింగ్‌ జూన్ 14 నుంచి ప్రారంభంకానుంది. మొత్తం రెండు ఫేజ్ లలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. అందుకోసం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


Published Jun 12, 2025 01:21:00 PM
postImages/2025-06-12/1749714779_APECTResults.jpg.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :  తెలంగాణ  ఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నతమండలి విడుదల చేసింది. ఈ పరీక్షల అర్హతల పొందిన అభ్యర్ధులు బీటెక్ సెకండ్ ఇయర్ , బీఫార్మసీ సెకండ్ ఇయర్ లో , బీఫార్మసీ సెకండ్ ఇయర్ లో అడ్మిషన్స్ పొందనున్నారు. కౌన్సిలింగ్ ఆధారంగా అభ్యర్ధులకు సీట్లను కేటాయించనున్నారు. 


తెలంగాణ ఈసెట్‌ -2025 కౌన్సెలింగ్‌ జూన్ 14 నుంచి ప్రారంభంకానుంది. మొత్తం రెండు ఫేజ్ లలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. అందుకోసం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫస్ట్ విడత కౌన్సిలింగ్ కోసం జూన్ 14 నుంచి 18 వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
జూన్ 17 నుంచి 19 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. జూన్ 17 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ 25 వ తేదీన ఈసెట్  ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయిగింపు జరుగుతుంది. విద్యార్ధులు జూన్ 29 లోపు రిపోర్జింగ్ చేసుకోవాలి.


ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం జూలై 11 నుంచి 13 వరకు స్లాట్ బుక్ చేసుకోవాలి. జూలై 14న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. జులై14 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. జూలై 15 న వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ఉంటుంది. జూలై 18 వ తేదీ లోపు సీట్ల కేటాయింపు ప్రక్రియ. జూలై 18 నుంచి 20 మధ్యలో సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 19 నుంచి 22 మధ్యలో సీటు పొందిన కాలేజీలో రిపోర్టింగ్ . జూలై 23వ తేదీలోపు విద్యార్థులు అడ్మిషన్లు పొందాలి. లేకపోతే సీటు క్యాన్సిల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu students comptetive-exams telangana

Related Articles