The Raja Saab: 'రాజాసాబ్' మోషన్ పోస్టర్.. లుక్ అద్దిరిపోయిందంటున్న ఫ్యాన్స్ !

ప్రభాస్ రాయల్ గా సింహాసనం పై కూర్చొని సిగార్ కాలుస్తూ రాజుల లుక్ లో కనిపించారు. ఇక ఈ మోష‌న్ పోస్ట‌ర్‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. 


Published Oct 23, 2024 04:56:00 PM
postImages/2024-10-23/1729683091_hq720.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్:  రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సంధర్భంగా " ది రాజా సాబ్ " మేకర్స్ అభిమానుల కోసం ఓ డిఫరెంట్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.  ఇంతకు ముందు ప్రభాస్ ను ఎప్పుడు ఇలా చూడలేదు. అలా సరికొత్తగా కనిపించారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ రాయల్ గా సింహాసనం పై కూర్చొని సిగార్ కాలుస్తూ రాజుల లుక్ లో కనిపించారు. ఇక ఈ మోష‌న్ పోస్ట‌ర్‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. 


ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి డైరెక్ష‌న్‌లో హారర్ కామెడీ జాన‌ర్‌లో రాజాసాబ్ తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే  చాలావరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మిగిలిన సినిమా కూడా వీలైనంత ఫాస్ట్ గా పూర్తి చేసే పనిలో మూవీ టీం తెలిపింది.


ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో క‌నిపించ‌నున్నారు.  ఇప్పుడు ప్రభాస్ మార్కెట్ చాలా పెద్దది. సో క్రూ కూడా చాలా పెద్దగా మొదలవుతుంది. ప్రభాస్ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాళం, కన్నడలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్‌ కానుంది.

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu birthday rajasab

Related Articles