Shreya Ghoshal: కోలకత్తా మెడికో కోసం పాట పాడి ..నివాళులర్పించిన శ్రేయాఘోషల్ !

బెంగాల్‌లోని కోల్‌కతాలో శ్రేయా ఘోషల్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. అయితే ఈ షోలో శ్రేయ ఎమోషనల్ అయ్యారు. ఆమెను చూసి ఆడియన్స్ కూడా ఎమోషల్ అయ్యారు. 


Published Oct 23, 2024 12:55:00 PM
postImages/2024-10-23/1729668389_shreyaghoshal1.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: శ్రేయోఘోషల్ గురించి తెలియని వారెవరు.దాదాపు అన్ని భారతీయ భాషల్లో పాడి అలరించారు. మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ స్టార్ సింగర్. శ్రేయా వాయిస్ లో ఏదో చక్కర పోసినట్లు ఉంటుంది. శ్రేయా గొంతు మ్యూజిక్ లవర్స్ కు ఓ స్పెషల్ మ్యాజిక్ ..ఎనర్జీని ఇస్తారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో శ్రేయా ఘోషల్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. అయితే ఈ షోలో శ్రేయ ఎమోషనల్ అయ్యారు. ఆమెను చూసి ఆడియన్స్ కూడా ఎమోషల్ అయ్యారు. 


కొన్ని నెలల క్రితం కోల్‌కతాలోని ఆర్కే మెడికల్ కాలేజీ యువతి అత్యాచారం, హత్య ఘటన దేశ విదేశాల్లో వార్తల్లో నిలిచింది. పశ్చిమ బెంగాల్‌లో వైద్యులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. నిరసనలు అన్ని జరుగుతున్నాయి కాని లాభం లేదు . కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో శ్రేయా ఘోషల్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు.


మరణించిన విద్యార్థి కోసం శ్రేయా ఘోషల్ బెంగాలీ పాట ‘ఈ జీ సోరియర్, చిట్కార్’ పాడారు. ఈ పాట అర్థం ‘ఈ రోజు మీరు ఈ శరీరం యొక్క ఏడుపు విన్నారు’.  ఈ పాటకు ఎవ్వరు చప్పట్లు కొట్టద్దని తెలిపారు శ్రేయా ఘోషల్.  వి వాంట్ జస్టిస్ నినాదాలతో స్టేడియం మారుమ్రోగింది. శ్రేయా ఘోషల్ కంటే ముందు అరిజిత్ సింగ్ కూడా కోల్‌కతాలో ఒక ప్రదర్శన ఇచ్చాడు. ఈ ఘటనను ఆయన కూడా తీవ్రంగా ఖండించారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nirbhayaofkolkata singer junior-doctor

Related Articles