tollywood: గుట్టుగా పెళ్లి చేసేసుకున్న యంగ్ హీరో !

తన పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ 'ఏ ప్రామిస్ ఆఫ్ లైఫ్ టైమ్' అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఏడాది ఆగస్టులో విశ్వంత్- భావనల నిశ్చితార్థం జరిగింది.


Published Oct 22, 2024 06:44:00 PM
postImages/2024-10-22/1729602929_500x300382777sunday.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాలీవుడ్ లో కేరింత ఫేమ్ విశ్వంత్ తన లైఫ్ ను కొత్త స్టార్ట్ చెయ్యబోతున్నారు. ఏడుగుల బంధంలో అడుగులు పెడుతూ బ్యాచ్ లర్ లైఫ్ కు బై బై చెబుతూ భావన అనే అమ్మాయితో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. ఈ విషయం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు. అంతేకాదు తన పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ 'ఏ ప్రామిస్ ఆఫ్ లైఫ్ టైమ్' అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఏడాది ఆగస్టులో విశ్వంత్- భావనల నిశ్చితార్థం జరిగింది.


అసలు ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా పెళ్లిచేసుకున్నాడు విశ్వంత్. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సామర్ల కోటకు చెందిన విశ్వంత్ కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆతర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాడు. 


అయితే అదే సమయంలో దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన ‘కేరింత’ సినిమా లో విశ్వంత్ కు ఆఫర్ వచ్చింది.దీంతో ఇంజినీరింగ్ మధ్యలో ఆపేసి సినిమా ఇండస్ట్రీ కి వచ్చాడు. తర్వాత చాలా ప్రయత్నాలు చేసినా పెద్దగా అవకాశాలు లేవు. విశ్వంత్ కు యాక్టింగ్ లో మంచి మార్కులు పడ్డాయి. కాని తను ఎలివేట్ అయ్యేంత మంచి సినిమాలు పడలేదు. చూద్దాం ..లైఫ్ లో సక్సస్ ఎప్పుడైనా రావచ్చు కదా..
 

newsline-whatsapp-channel
Tags : tollywood wedding

Related Articles