PRABHAS: 'బాహుబలి' కంటే ముందే ప్రభాస్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ ?

ఆ మూవీ రిలీజ్ అయిన ఏడాది కి 'బాహుబలి'గా వచ్చి అందరినీ ఆకట్టుకుని అక్కడి టాప్ హీరోస్ సరసన చేరిపోయాడు


Published Oct 23, 2024 12:15:29 AM
postImages/2024-10-23/1729660511_prabhasbirthday.webp


న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  రెబల్ స్టార్ పుట్టినరోజు  ఈరోజు ...రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ యాక్టర్ . జపాన్ , ఛైనా , లండన్ , అమెరికా లాంటి దేశాల్లో ప్రభాస్ కు భారీ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ  ఫేమ్ ఇప్పుడు వచ్చింది కాదు...బాలీవుడ్ లో ప్రభాస్ సినిమా ఎప్పుడో రిలీజ్ అయింది. కాని బాహుబలితో ఫేమ్ వచ్చింది.ప్రభుదేవా తెరకెక్కించిన యాక్షన్‌ జాక్సన్‌(2014) అనే సినిమాలో ఓ పాటలో అతిథి పాత్రలో మెరిశారు.

ఎనర్జిటిక్ స్టెప్పులేసి అదరగొట్టాడు. కానీ ఈ సినిమా వచ్చిన సమయంలో ప్రభాస్‌కి నార్త్​లో అంత గుర్తింపు లేదు. ఆ మూవీ రిలీజ్ అయిన ఏడాది కి 'బాహుబలి'గా వచ్చి అందరినీ ఆకట్టుకుని అక్కడి టాప్ హీరోస్ సరసన చేరిపోయాడు. దీంతో ఆ తర్వాత యాక్షన్ జాక్సన్​ చూసిన చాలా మంది ప్రభాస్​ను గుర్తుపట్టి ఆ క్లిప్పింగ్స్​ను నెట్టింట తెగ ట్రెండ్ చేశారు.


ప్రభాస్ ఫేవరట్ డైరెక్టర్ల లిస్ట్​లో రాజమౌళి తర్వాత బాలీవుడ్‌ డైరెక్టర్ రాజ్‌కుమార్‌ హిరాణీ ఉన్నారు.  రాజ్ కుమార్ తీసిన త్రీ ఇడియట్స్ , మున్నాభాయ్ ఎంబీబీఎస్ లాంటి సినిమాలు చాలా ఇష్టం.  ఓ ఇరవై సార్లు చూశారట. ఇక హాలీవుడ్‌లో దిగ్గజ నటుడు రాబర్డ్‌ డినీరో అన్నా అంతే ప్రభాస్​కు ఇష్టమట. ప్రభాస్ కు ఈశ్వర్ సినిమా ఓకే ఓకే అనిపించింది. అయితే వర్షం మాత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. తర్వాత తర్వాత ప్రభాస్ తన కెరియర్  గ్రాఫ్ ను పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ గ్రాఫ్ పాన్ వరల్డ్ లెవెల్ లో ఉందంటే నమ్మండి.

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu movie-news bollywood- birthday

Related Articles