OTT Movie: ఓటీటీలో దిమ్మతిరిగే హార్రర్ మూవీ ..బెస్ట్ హార్రర్ మూవీ ఇదే !

" ది అకాళి" అనే ఈ సినిమా..సీరియ‌స్ డార్క్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు. థియేటర్లలో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.


Published Apr 23, 2025 07:15:00 PM
postImages/2025-04-23/1745416036_ottmovie5.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఎన్ని హార్రర్ మూవీస్ వచ్చినా మళ్లీ ఓటీటీలో హార్రర్ సినిమా అనగానే థ్రిల్లింగ్ గా ఎదురుచూస్తారు. అయితే ఐఎమ్ డీబీలో ఈ సినిమా కు 10 కి 9.1 రేటింగ్ ఇచ్చారంటే సూపర్ డూపర్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా ఇంకా ఓటీటీలోకి రాబోతుంది. " ది అకాళి" అనే ఈ సినిమా..సీరియ‌స్ డార్క్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు. థియేటర్లలో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.


ఈ సినిమాలో ప్రముఖ నటుడు నాజర్ లీడ్ రోల్ పోషించడం విశేషం. అలాగే త‌లైవాస‌ల్ విజ‌య్‌, జ‌య‌కుమార్ జాన‌కిరామ‌న్‌, వినోద్ కిష‌న్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ఒక అమ్మాయి క్షుద్రవిద్యలు , అతీంద్రియ శక్తుల సహాయంతో వరుసగా హత్యలకు పాల్పడుతుంది. ఈ హ‌త్య‌ల వెనుక ఉన్న మిస్ట‌రీని ఛేదించేందుకు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీస‌ర్ బరిలోకి దిగుతాడు. అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి...ఎలా జరుగుతున్నాయనేది స్టోరీ. 


ఈ మూవీ పేరు ది అకాళి. కోలీవుడ్ డైరెక్టర్ మహ్మద్ మ‌హ‌మ్మ‌ద్ ఆసీఫ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. లాస్ట్ ఇయర్ థియేటర్ కు వచ్చింది. తమిళ్ ఆహాలో దుమ్మురేపుతున్న సినిమా ...ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతుంది. ఈ నెల 26 నుంచి ది అకాళ్ తెలుగు వెర్షన్ రిలీజ్ అవుతుంది. ఈ సమ్మర్ కు బెస్ట్ అంటే బెస్ట్ సినిమా . థ్రిల్లింగ్ మూవీస్ ఇష్టపడేవారికి బెస్ట్ ఆప్షన్ .


 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ott-movies horror-movies

Related Articles