Venkatesh: వెంకీ మూవీ లో బాలయ్యను సెట్ చేసిన డైరెక్టర్.?

విక్టరీ వెంకటేష్.. ఇప్పటికే 75 సినిమాలను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన తన రాబోయే సినిమాల కోసం కసరత్తును మొదలెట్టేసారు. వెంకటేష్ హీరోగా చేస్తున్న మూవీ లో బాలకృష్ణ కూడా నటించబోతున్నట్టు ఒక క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ వీరిద్దరి కాంబినేషన్లో మూవీ సెట్ చేసిన డైరెక్టర్ ఎవరా అనుకుంటున్నారా..ఆయన ఎవరో కాదు అనిల్ రావిపూడి.. ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి  ఫస్టాఫ్ లో వెంకటేష్ ని పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నారట. కానీ సెకండాఫ్ లో మాత్రం ఒక అరగంటసేపు పూర్తిగా యాక్షన్ సన్నివేశం ఉంటుందట. అయితే దీనికోసం బాలకృష్ణని తీసుకుంటే బాగుంటుందని అనిల్ రావిపూడి భావించారట. ఈ సినిమాలో ఒక అరగంట యాక్షన్ సన్నివేశం కోసం బాలకృష్ణ ని సంప్రదించినట్లు తెలుస్తోంది.ఒకవేళ ఇదే నిజమైతే వెంకటేష్ బాలకృష్ణ కాంబోలో రాబోతున్న సినిమా చూస్తే అభిమానులకు రెండు కళ్ళు చాలవు అంటూ నందమూరి, దగ్గుబాటి అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.


Published Jul 02, 2024 01:16:00 PM
postImages/2024-07-02/1719902377_venky.jpg

న్యూస్ లైన్ డెస్క్: విక్టరీ వెంకటేష్.. ఇప్పటికే 75 సినిమాలను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన తన రాబోయే సినిమాల కోసం కసరత్తును మొదలెట్టేసారు. ఇక డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తన 75వ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సైంధవ్ మూవీతో వచ్చినప్పటికీ ఈ సినిమా వెంకీ అభిమానులను నిరాశపరిచింది. దాంతో తన నెక్స్ట్ ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెట్టేశారు వెంకటేష్.ప్రస్తుతం వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్స్ గా చేస్తున్నారు.

అయితే తాజాగా ఫిలిం సర్కిల్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం..  వెంకటేష్ హీరోగా చేస్తున్న మూవీ లో బాలకృష్ణ కూడా నటించబోతున్నట్టు ఒక క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ వీరిద్దరి కాంబినేషన్లో మూవీ సెట్ చేసిన డైరెక్టర్ ఎవరా అనుకుంటున్నారా..ఆయన ఎవరో కాదు అనిల్ రావిపూడి.. ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి  ఫస్టాఫ్ లో వెంకటేష్ ని పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నారట. ఇందులో ఫన్ అండ్ యాక్షన్ సన్నీవేషాలు ఉంటాయట. కానీ సెకండాఫ్ లో మాత్రం ఒక అరగంటసేపు పూర్తిగా యాక్షన్ సన్నివేశం ఉంటుందట.అయితే దీనికోసం బాలకృష్ణని తీసుకుంటే బాగుంటుందని అనిల్ రావిపూడి భావించారట.

 వెంకటేష్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో ఒక అరగంట యాక్షన్ సన్నివేశం కోసం బాలకృష్ణ ని సంప్రదించినట్లు తెలుస్తోంది.అయితే బాలకృష్ణ ప్రస్తుతం వేరే సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ కేవలం కొద్దిసేపు స్క్రీన్ స్పేస్ మాత్రమే కాబట్టి డేట్స్ కూడా తక్కువగానే అడుగుతారు. అందుకే ఈ సినిమా బాలయ్య బాబు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.ఒకవేళ ఇదే నిజమైతే వెంకటేష్ బాలకృష్ణ కాంబోలో రాబోతున్న సినిమా చూస్తే అభిమానులకు రెండు కళ్ళు చాలవు అంటూ నందమూరి, దగ్గుబాటి అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి వైరలయ్యే ఈ క్రేజీ రూమర్ లో ఎంత నిజముందో చూడాలి

newsline-whatsapp-channel
Tags : newslinetelugu venkatesh balakrishna anil-ravipudi meenakshi-choudary aishwarya-rajesh

Related Articles