Tollywood:జక్కన్న, మహేష్ బాబు కాంబో మూవీ టైటిల్ ఇదే.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి టాప్ 5 డైరెక్టర్లలో రాజమౌళి కూడా ఒకరు. బాహుబలి సినిమా ద్వారా  ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇలాంటి రాజమౌళి  తన పేరు పెంచుకోవడమే కాకుండా హీరోల రేంజ్ ను కూడా పెంచేశాడు. అలా రాజమౌళి చేతిలో పడ్డ చాలా మంది హీరోలు పాన్ ఇండియా స్టార్లు అయ్యారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రభాస్,  జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అని చెప్పవచ్చు.


Published Jul 25, 2024 11:03:12 AM
postImages/2024-07-25/1721915491_rajamouli.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి టాప్ 5 డైరెక్టర్లలో రాజమౌళి కూడా ఒకరు. బాహుబలి సినిమా ద్వారా  ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇలాంటి రాజమౌళి  తన పేరు పెంచుకోవడమే కాకుండా హీరోల రేంజ్ ను కూడా పెంచేశాడు. అలా రాజమౌళి చేతిలో పడ్డ చాలా మంది హీరోలు పాన్ ఇండియా స్టార్లు అయ్యారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రభాస్,  జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అని చెప్పవచ్చు.

అలాంటి రాజమౌళి కన్ను ప్రస్తుతం  సూపర్ స్టార్ మహేష్ బాబుపై పడింది. ఆయనతో సినిమా చేయడానికి ఇప్పటికే సిద్ధమైపోయాడు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.  ఇప్పటికే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని అనేక వార్తలు వినిపించాయి. ఈ చిత్రంపై అనేక అంచనాల నెలకొన్నాయి.  కానీ ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ కూడా చిత్ర యూనిట్ అప్డేట్ చేయలేదు. కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గురించి ఒక వార్త బయటకు వచ్చింది.

చాలావరకు స్టార్ హీరోల సినిమాలకు సంబంధించినటువంటి విషయాలను వారి బర్త్ డేలు, లేదంటే స్పెషల్ అకేషన్స్ సమయంలో రిలీజ్ చేస్తూ ఉంటారు. మహేష్ బాబు బర్త్ డే ఆగస్టు 9వ తేదీన ఉంది కాబట్టి ఆ రోజునే  మహేష్ బాబు మరియు జక్కన్న కాంబినేషన్ లో వచ్చే సినిమా గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.  ఇదే కాంబోలో వచ్చే చిత్రం పేరు గోల్డ్ అని పెట్టినట్టు తెలుస్తోంది.  దీనికి సంబంధించి అధికారికంగా వార్తలు బయటకు రాలేదు కానీ, టైటిల్ మాత్రం ఇదే ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr gold rajamouli rrr ramcharan

Related Articles