గౌడ్ భవన్‌కు నిధులు కేటాయించి, దానికి సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ పేరుని పెట్టారని అన్నారు. విగ్రహ ఏర్పాటుకు కూడా కేసీఆర్ నిధులు కేటాయించారని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన చిత్రపటానికి BRS నాయకులు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. గతంలో ఎవరు కూడా సర్దార్ పాపన్న గౌడ్ జయింతిని చేయలేదని అన్నారు. తెలంగాణ వచ్చిన తరవాత మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించారని తెలిపారు.
గౌడ్ భవన్‌కు నిధులు కేటాయించి, దానికి సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ పేరుని పెట్టారని అన్నారు. విగ్రహ ఏర్పాటుకు కూడా కేసీఆర్ నిధులు కేటాయించారని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పైన ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కూడా అయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. బీసీ జనగణనను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. పాఠ్యపుస్తకాల్లో సర్వాయి జీవిత చరిత్రను చేర్చాలని కోరారు.