ఢిల్లీ లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇండియాని ఓ పాకిస్థానీ లవ్ జంట తక్కువ చేసి మాట్లాడారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఢిల్లీ లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇండియాని ఓ పాకిస్థానీ లవ్ జంట తక్కువ చేసి మాట్లాడారు. అది కూడా క్యాబ్ లో ...చూసి చూసి క్యాబ్ డ్రైవర్ కు చిర్రెత్తుకొచ్చి ఏం చేశాడో చూసేద్దాం..
భారత్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర ఘటన జరిగింది. మన దేశాన్ని కించపరుస్తూ మాట్లాడిన ఓ పాకిస్థానీకి, అతని గర్ల్ ఫ్రెండ్‌కి క్యాబ్ డ్రైవర్ తగిన బుద్ధి చెప్పాడు. అబ్బాయి పాకిస్థానీ...అమ్మాయి మాత్రం ఇండియన్ వీరిద్దరు ఓ క్యాబ్ ఎక్కి ఎక్కడికో వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. క్యాబ్ లో వారిద్దరు మాట్లాడుకుంటున్నారు. భారత్ ను తక్కువ చేసి...భారతీయుల్ని తిట్టుకుంటూ పాకిస్థానీ మాట్లాడుతుంటే ఆయన కు వత్తాస తన గర్ల్ ఫ్రెండ్. ఇక క్యాబ్ డ్రైవర్ కు ఉక్రోషం ఆగలేదు. వాదన అనవసరం అనుకొని ఇద్దరిని అక్కడిక్కడే ...క్యాబ్ నుంచి దింపేసి ..మిమ్మల్ని తీసుకొని వెళ్లలేను అంటూ చెప్పేశాడు.
ఈ వీడియో తెగ వైరల్ అయిపోతోంది. పాకిస్థానీ వ్యక్తితో పాటు అతని ఇండియన్ గర్ల్‌ఫ్రెండ్‌కి తగిన గుణపాఠం చెప్పాడని ఉబర్ డ్రైవర్‌ను కొందరి ప్రశంసిస్తున్నారు. అతని దేశభక్తిని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అతని చర్యలకు విమర్శిస్తున్నారు.
Leftist who always find Pakistan a better country than BHARAT. But the can driver given a good lesson patriots are not on border they're inside the country as well. SALUTE https://t.co/9Pn9zRJePj pic.twitter.com/XOOKVbbM5X — AbhishekDhiman (@GetDhiman) August 11, 2024