కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఇలా అందరూ నిరాశపర్చినా 69 ఏళ్ల వయసులో తన ట్రయథ్లాన్ కలను ఎలా సాకారం చేసుకున్నాడన్నదే విజయ్ 69 మూవీ .
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ గురించి ఎంత చెప్పినా తక్కువ. కరెక్ట్ కోసం ప్రాణం నటుల్లో ఆయన కూడా ఒకరు. రీసెంట్ గా తెలుగు సినిమాల్లో బాగానే నటిస్తున్నరు. అయితే అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విజయ్ 69. టైటిల్ కు తగ్గట్టుగానే 69 ఏళ్ల వయసులో తన కలను సాకారం చేసుకునే ఒక వ్యక్తి కథ ఇది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఇలా అందరూ నిరాశపర్చినా 69 ఏళ్ల వయసులో తన ట్రయథ్లాన్ కలను ఎలా సాకారం చేసుకున్నాడన్నదే విజయ్ 69 మూవీ .
విజయ్ 69 సినిమా శుక్రవారం (నవంబర్ 08) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హిందీ, తెలుగు లాంగ్వేజ్ ల్లో కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా బాగానే ఉన్నాయని ట్రైలర్ లోనే అర్ధమయ్యింది. 69 ఏళ్ల వయసులో ట్రయథ్లాన్ లో పార్టిసిపేట్ చేయాలని నిర్ణయించుకుంటాడు యాంగ్రీ ఓల్డ్ మ్యాన్.
ఈ ట్రయథ్లాన్ లో భాగంగా 1.5 కి.మీ. స్విమ్మింగ్, 40 కి.మీ. సైక్లింగ్, 10 కి.మీ. రన్నింగ్ పూర్తి చేస్తానని తన ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఛాలెంజ్ విసురుతాడు. అలాంటప్పుడు అతన్ని చూసి అందరు నవ్వుతారు. చివరికి ట్రయథ్లాన్ నిర్వాహకులు కూడా అప్లికేషన్ రిజక్ట్ చేసేస్తారు. తన కల ఎలా నిజమైంది..తను సాధించాడా లేదా అనేది సినిమా.
అనుపమ్ ఖేర్ వయసు ఇప్పుడు 69 ఏళ్లు. ఈ వయసులో కొత్తవి నేర్చుకునే ధైర్యం ఎవరికీ ఉండదు. ఈ వయసులో సినిమా కోసం ఆయన ఈత నేర్చుకున్నారు. దీనికి కారణం ‘విజయ్ 69’ సినిమా. ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘రాబోయే సంవత్సరాల్లో నేను కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్రతి సినిమా నాకో కొత్త విద్యను నేర్పించింది. నేర్చుకుంటాను..ఇంకా ఇంకా నేర్చుకుంటాను.