ఈ మధ్యకాలంలో ప్రేమ మరణాలు ఎక్కువవుతున్నాయి. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడి ప్రేమించిన వ్యక్తిని పొందలేక ఆత్మహత్య చేసుకోవడమే ప్రధాన అస్త్రంగా వాడుతున్నారు. తాజాగా ఒకే ఇంటికి చెందిన అన్నా చెల్లెళ్లు ఇద్దరు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రికి చెందిన పాలకుర్తి లింగయ్య పద్మ భార్యాభర్తలు. వీరికి కొడుకు ప్రశాంత్ (22), కూతురు నవ్య ఉన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో ప్రేమ మరణాలు ఎక్కువవుతున్నాయి. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడి ప్రేమించిన వ్యక్తిని పొందలేక ఆత్మహత్య చేసుకోవడమే ప్రధాన అస్త్రంగా వాడుతున్నారు. తాజాగా ఒకే ఇంటికి చెందిన అన్నా చెల్లెళ్లు ఇద్దరు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రికి చెందిన పాలకుర్తి లింగయ్య పద్మ భార్యాభర్తలు. వీరికి కొడుకు ప్రశాంత్ (22), కూతురు నవ్య ఉన్నారు.
అయితే కూతురుకు గత ఆరు నెలల కింద ఒక యువకుడితో వివాహం జరిగింది. ఆ వ్యక్తి ఈ మధ్యకాలంలోనే బ్రతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్ళాడు. అయితే నవ్య పెళ్లికి ముందే అదే గ్రామానికి చెందినటువంటి ఒక యువకుడితో ఐదు సంవత్సరాల నుంచి లవ్ లో ఉంది. నవ్య భర్త గల్ఫ్ కు వెళ్ళిన తర్వాత ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వివాహం చేయాలని పట్టు పట్టింది.
కానీ తల్లిదండ్రులు దానికి ఒప్పుకోకపోవడంతో మనస్థాపం చెందిన నవ్య మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకొని మరణించింది. అయితే ఇదే తరుణంలో నవ్య ఏ వ్యక్తినైతే ప్రేమించిందో ఆ వ్యక్తి చెల్లెను నవ్య సోదరుడైన ప్రశాంత్ గత ఐదు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నారు. అయితే దీని గురించి ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పారు. కానీ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ప్రశాంత్ కూడా పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అన్నా చెల్లెలు ఇద్దరు ప్రేమ విఫలమై మరణించడం జిల్లాలోనే కలకలం రేపింది.